42.2 C
Hyderabad
May 3, 2024 17: 32 PM
Slider గుంటూరు

అన్ రిజిస్టర్డ్ కి అన్ రికగ్నైజ్డ్ కి తేడా తెలియదా?

#navataramparty

ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ కార్యాలయంలో కనీసం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకి,అసలు రిజిస్టర్ కానీ రాజకీయ పార్టీల కు తేడా తెలియని అధికారులు పనిచేయడం సిగ్గుచేటు అని నవతరంపార్టీ  అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం అన్నారు. సీఈవో ఆంధ్రప్రదేశ్ నుండి రానున్న ఎన్నికలలో ప్రచారం నిర్వహించే సమయంలో పర్యావరణ పరిరక్షణ గురించి కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన మార్గదర్శనం గురించి నవతరంపార్టీ కి అందిన లేఖ Memo No.1669/Elevator.A/A/2023-2 లో రికగ్నైజ్డ్ ,అన్ రిజిస్టర్డ్ పార్టీస్ అంటూ రాయడాన్ని రావుసుబ్రహ్మణ్యం తప్పుపట్టారు.

అసలు రిజిస్టర్ కానీ రాజకీయ పార్టీలకు లేఖలు పంపే అవకాశమే లేదని తెలిపారు. కనీసం రాజకీయపార్టీలకు లేఖ రాయడంలో కూడా సీరియస్ నెస్ లేని అధికారులు ఎలా రేపు ఎన్నికలు నిర్వహిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుండి ప్రతి రాజకీయ పార్టీకి ఈమెయిల్ ఐడి,పాస్ వర్డ్ ఇస్తామని చెప్పిన అధికారులు ఇప్పటివరకు అటువంటి చర్యలు చేపట్టకుండా ఉండటంతో ఆన్లైన్లో పత్రాలను దాఖలు చేయడం కష్టంగా ఉంది అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ముఖేష్ కుమార్ మీనా ని కలసి నవతరంపార్టీ నుండి ఓటరులిస్టులు తయారీ విధానం తో పాటు పలు అంశాలపై వినతిపత్రం ఇవ్వనున్నట్లు రావుసుబ్రహ్మణ్యం తెలిపారు.

Related posts

ఎన్నికల విధుల పట్ల పూర్తి అవగాహన ఉండాలి

Satyam NEWS

రివర్స్ గేర్ :నా భార్య కొడుతుంది సార్‌ మీరే కాపాడాలి

Satyam NEWS

న్యూ థాట్: ఈ కటింగ్ కేసీఆర్ కు అంకితం

Satyam NEWS

Leave a Comment