31.2 C
Hyderabad
May 2, 2024 23: 38 PM
Slider వరంగల్

ప్రతి చట్టం పై పిల్లలకు అవగాహన అవసరం

జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఆద్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్, డాక్టర్ అనితా రెడ్డి అద్యక్షతన వరంగల్ ఆటోనగర్ లోని అంధుల పాఠశాల ఆశ్రమంలో వినియోగ దారులు హక్కుల చట్టం-2019 పై పిల్లలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పిల్లలందరికీ చలి ఎక్కువ ఉండడంతో రగ్గులను ఉచితముగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ది. ఎన్. సి. ఆర్. సి నేషనల్ చైర్మన్ డాక్టర్ సాయి రమేష్ ,ఆత్మీయ అతిథిగా అడ్మిన్ చైర్మన్ రామానుజ స్వామి విచ్చేసి వినియోగదారుల హక్కుల చట్టం పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాల పై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. చిన్నతనం నుండే వినియోగ దారులు మెలుకువలు పిల్లలు నేర్చుకోవాలని అన్నారు. ప్రజలను చైతన్యం చేసి ఎవరు మోసపోకుండా చేయడమే తమ ది. ఎన్ సి. ఆర్. సి లక్షం అని అన్నారు.

ప్రతి వస్తువు కొన్నప్పుడు బిల్లు, గారంటి కార్డు, వారంటీలను తీసుకోవాలని అప్పుడు మనకు ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు కేసు వేయడానికి ఇవి ఉపయోగ పడతాయని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు, అనంతరం అతిథుల చేతులు మీద పిల్లలకు రగ్గులను అందించారు. పిల్లలు పాటలు పాడి అతిదులను అలరించారు. అనంతరం పిల్లలకు స్నాక్స్, పండ్లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమం లో సాంబమూర్తి, కే. రామ్ రెడ్డి, వెంకటేశ్వర్లు, శైలజ, పిల్లలు పాల్గొన్నారు.

Related posts

వైరల్ వీడియోను ఫాలో అవుతున్న కర్నూలు పోలీసు

Satyam NEWS

తప్పుల తడకగా పీఐబీ ఫ్యాక్ట్ చెక్

Bhavani

‘కురు సభ’ను బహిష్కరించండి

Bhavani

Leave a Comment