35.2 C
Hyderabad
April 27, 2024 14: 51 PM
Slider హైదరాబాద్

డివిజన్ లో వెయ్యి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలి

#AS Rao Nagar

ఏఎస్ రావునగర్ డివిజన్ పరిధిలో సుమారు వెయ్యి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సమావేశంలో కాప్రా సర్కిల్ విద్యుత్ డిఈ రవీంద్ర ఏ ఈ ప్రత్యూష తోపాటు ఈఎస్ఎల్ ప్రాజెక్టు ఇంజనీర్ కరుణాకర్ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శిరీష సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ డివిజన్ పరిధిలో 15 హైమాస్, మినీ మాస్ విద్యుత్ దీపాల అవసరమన్నారు. అదే విధంగా డివిజన్ పరిధిలోని పద్మశాలి టౌన్ షిప్ సెంట్రల్ లైటింగ్ సిస్టం అమర్చాలని అధికారులకు సూచించారు. సెంట్రల్ లైటింగ్ సిస్టం తో పాటు మిగిలిన విద్యుత్ స్తంభాలకు లైట్లు బిగించాలని కోరారు.

దీంతో పాటు శివారు ప్రాంతాలలో ఇల్లు కట్టుకొని నివసిస్తున్న చోట్ల అవసరమైన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా డిఈ రవీంద్ర మాట్లాడుతూ ఇప్పటికే డివిజన్ పరిధిలో 200 విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలో మరో రెండు నుంచి 300 విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

మిగిలినవి దశల వారీగా ఏర్పాటు చేస్తామని అన్నారు. నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆదేశాల మేరకు అన్ని డివిజన్ల వారీగా విద్యుత్ దీపాలపై సమీక్షలు జరుపుతూ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

నవ నవోన్మేష ప్రతిభా స్వరూపం నందమూరి

Satyam NEWS

ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు అందరూ సహకరించాలి

Satyam NEWS

మహిళల భద్రతకు ‘దిశా’ యాప్ తో పూర్తి భరోసా

Satyam NEWS

Leave a Comment