40.2 C
Hyderabad
May 2, 2024 18: 54 PM
Slider రంగారెడ్డి

సిపిఆర్ మీద అవగాహన కార్యక్రమం

#cbit

సిబిఐటి  ఎన్ఎస్ఎస్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీతో కలిసి కార్డియోపల్మనరీ రీససిటేషన్ (సిపిఆర్ )పై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భం గా రెడ్ క్రాస్ సొసైటీ   ప్రతినిధి మాట్లాడుతూ సిపిఆర్ అనేది కార్డియాక్ అరెస్ట్‌ను ఎదుర్కొంటున్న లేదా ఊపిరి పీల్చుకోని వ్యక్తులను పునరుద్ధరించడానికి ఉపయోగించే ఒక కీలకమైన లైఫ్ సేవింగ్ టెక్నిక్. కార్డియాక్ అరెస్ట్ పరిస్థితుల్లో ఇది చాలా అవసరం. గుండె‌ పైభాగంలో ఉండే స్టెర్నమ్ అనే ఎముక వద్ద ప్రెజర్ ఇచ్చి, హార్ట్‌ను స్టిమ్యులేట్ చేయాలి. ఎంత ప్రెజర్ ఇవ్వాలో అంతే ఇవ్వాలి.

ఎక్కువ ప్రెజర్ ఇస్తే రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగని వీక్‌గా చేస్తే ప్రెజర్ సరిపోదు. అందువల్ల ఒక మోతాదులో చేయాల్సి ఉంటుంది. పేషంట్ అస్వస్థతకు గురైన ప్రదేశంలో బెడ్ లాంటిది లేకపోతే.. నేల మీద పడుకోబెట్టి చేయొచ్చు. ఇద్దరు వ్యక్తులు కూడా సీపీఆర్ చేయొచ్చు. ఒక వ్యక్తి సీపీఆర్ చేస్తుంటే.. మరో వ్యక్తి నోటి ద్వారా శ్వాస అందించాలి. ఇలా చేస్తే ఫలితం ఇంకా మెరుగ్గా ఉంటుంది  అని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రథమ చికిత్స ఒకరి ప్రాణాలు కాపాడుతుంది.

సరైన సమయంలో సరైన చికిత్స అందిస్తే ఆపదలో ఉన్న వ్యక్తి బతికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ప్రతిఒక్కరు సిపిఆర్ పైన ఆవగాహన చాల అవసరం అని  అన్నారు. ఈ   కార్యక్రమంలో ఇతర అధ్యాపకులు శ్రీనివాస్ శర్మ, ప్రొఫెసర్ గణేష్ రావు విద్యార్థులు పాల్గొన్నారు. రెడ్  క్రాస్ నుండి వచ్చిన విజయ్ కుమార్ పెండ్యాల, వైస్ చైర్మన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రంగారెడ్డి జిల్లా, జి రమణ, రాష్ట్ర కో-ఆర్డినేటర్ సిపిఆర్  శిక్షణ, శైలేష్ బాబు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

విజయవాడ దుర్గగుడి ఈవో ఎంవీ సురేశ్‌ బాబు బదిలీ

Satyam NEWS

తెలంగాణ నుండి యూరప్ కు వేరుశనగ ఎగుమతులు

Satyam NEWS

ప్రధాన పర్యటన లో నిరసనకారులు ఘటనలో కాంగ్రెస్ కుట్ర

Satyam NEWS

Leave a Comment