23.7 C
Hyderabad
May 8, 2024 07: 01 AM
Slider ముఖ్యంశాలు

ఇస్రో జైత్రయాత్ర: అంతరిక్షంపై సిబిఐటి అవగాహనా కార్యక్రమం

#space

వైఎస్ఆర్  మేధో ఫోరమ్, సి బి ఐ టి కళాశాల ఆధ్వర్యంలో ఇస్రో జైత్రయాత్ర లో భాగం గా అంతరిక్షంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఇస్రో మాజీ శాస్త్రవేత్త యాళ్ల శివప్రసాద్ అంతరిక్షం,  చంద్రయాన్-I, II, మంగళయాన్ అంతరిక్ష నౌకల గురించి విద్యార్థులకు వివరించారు. 2030 నాటికి భారతదేశం తన  సొంత స్పేస్ హౌస్ ఏర్పరచుకుంటుందని చెప్పారు.

అంతరిక్షం గొప్ప స్ఫూర్తిదాయక శక్తిని కలిగి ఉందని, మానవ అంతరిక్షయానం అత్యాధునిక సాంకేతికతలతో మాత్రమే కాకుండా, నాగరికత లోతైన సాంస్కృతిక అంశాలతో కూడా ముడిపడి ఉంది అని చెప్పారు. ఈ సందర్బం గా అంతరిక్షంపై క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. వైఎస్ఆర్  మేధో ఫోరమ్ వ్యవస్థాపకుడు, చైర్మన్ జి శాంత మూర్తి, డిజి క్వెస్ట్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కె బాసి రెడ్డి తమ ప్రసంగంలో అంతరిక్షం మీద జరుగుతున్న వివిధ ప్రయోగాలు, మన భారత దేశం విజయాలు గురించి కొనియాడారు. ఈ కార్యక్రమ నిర్వాహణకర్త గా సహా ఆచార్యుడు రామదాసు, ప్రొఫెసర్ వై రమా దేవి, ఎన్ రామ దేవి, డాక్టర్ పద్మావతి రెడ్డి, కళాశాల పి ఆర్ ఓ డాక్టర్ జి ఎన్ ఆర్ ప్రసాద్ తదితరాలు పాల్గొన్నారు.

Related posts

స్వామీ చిన్మయానందా? ఎంత పని చేశావయా?

Satyam NEWS

టిడిపి అధికారంలోకి వస్తే సంక్షేమం ఆగిపోతుంది

Satyam NEWS

జైల్లో బాలకృష్ణ న్యూఇయర్​ సెలెబ్రేషన్స్

Satyam NEWS

Leave a Comment