27.3 C
Hyderabad
May 10, 2024 08: 38 AM
Slider జాతీయం

విద్వేషపూరిత ప్రసంగం కేసులో ఆజంఖాన్ కు శిక్ష

సమాజ్ వాది పార్టీ నాయకుడు ఆజం ఖాన్‌ విద్వేష పూరిత ప్రసంగం కేసుకు సంబంధించి మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ రామ్ పూర్ కోర్టు నేడు తీర్పు చెప్పింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాంపూర్ పార్లమెంట్ స్థానం నుంచి ఎస్పీ-బీఎస్పీ కూటమి అభ్యర్థిగా ఆజం ఖాన్ పోటీ చేశారు. ఏప్రిల్ 2019లో తన ఎన్నికల ప్రచారంలో మిలక్ కొత్వాలి ప్రాంతంలోని ఖతానగారియా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, అప్పటి జిల్లా మేజిస్ట్రేట్‌ ఆంజనేయ కుమార్‌ సింగ్‌పై ఆయన విద్వేష పూరిత ప్రసంగాలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆజం ఖాన్ ప్రసంగానికి సంబంధించిన వీడియో అప్పటిలో వైరల్‌గా మారింది. ఈ కేసులో వీడియో అబ్జర్వేషన్ టీమ్ ఇన్‌ఛార్జ్ అనిల్ కుమార్ చౌహాన్ తరపున మిలక్ కొత్వాలి వద్ద కేసు నివేదికను సమర్పించారు.

విచారణ అనంతరం పోలీసులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఎంపి-ఎమ్మెల్యే (మేజిస్ట్రేట్ ట్రయల్) నిశాంత్ మాన్ కోర్టులో ఈ విషయంపై విచారణ జరిగింది. గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆజం ఖాన్ కోర్టుకు చేరుకున్నారు. IPC సెక్షన్లు 153-A, 505-A మరియు 125 ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కోర్టు ఆయనను కోర్టు దోషిగా నిర్ధారించింది. దోషిగా నిర్ధారించిన తర్వాత, ఆజం ఖాన్‌ను కోర్టు కస్టడీకి తీసుకుంది.

సాయంత్రం 4.30 గంటలకు కోర్టు తన తీర్పును వెలువరించింది. ఇందులో ఆయనకు మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు ఆరు వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఆ తర్వాత ఆజం ఖాన్‌ పై కోర్టుకు అప్పీలు చేసుకోవడానికి వీలుగా బెయిల్ మంజూరైంది.మూడేళ్ల శిక్ష ఖరారు అయితే ఆజం ఖాన్ శాసనసభ్యత్వానికి ప్రమాదం రావచ్చు. ఎందుకంటే ఈ కేసులో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏదైనా కేసులో రెండేళ్లకు పైగా శిక్ష పడితే వారి సభ్యత్వాన్ని రద్దు చేస్తామని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. ఆజంకు శిక్ష పడడంతో బీజేపీ కార్యకర్తలు నగరంలో పలుచోట్ల బాణాసంచా పేల్చారు

Related posts

రీడ్ ఇండియా సెలబ్రేషన్ ఫైనలిస్టుల జాబితా ఇదే

Satyam NEWS

సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే నమ్మకం లేని సీఎం

Bhavani

ప్ర‌తి ఒక్క ఆంధ్రుడు గ‌ర్వించ‌ద‌గ్గ వ్య‌క్తి అల్లూరి

Satyam NEWS

Leave a Comment