40.2 C
Hyderabad
April 28, 2024 16: 10 PM
Slider మహబూబ్ నగర్

వాటెడ్ జస్టిస్: చిరువ్యాపారుల పొట్ట కొడితే ఎలా?

kollapur dharna

చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లాపూర్ పట్టణంలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రంగినేని జగదీశ్వరులు, కొల్లాపూర్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాము యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొల్లాపూర్ పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట, ప్రభుత్వ భవనాల ముందు, పురపాలిక దుకాణాల ముందు చిరు వ్యాపారులు తమ జీవన ఉపాధి కోసం డబ్బాలు, తడకలు వేసుకుని చాలా సంవత్సరాల చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారని అన్నారు.

చెప్పులు కుట్టుకోవడం, పూలు అమ్ముకోవడం, కొబ్బరి బొండాలు అమ్ముకోవడం, చికెన్, మటన్ షాపులు, పాన్ షాప్ లు, టైలర్ షాప్ లు, మెకానిక్ షాపు లు లాంటి ఎన్నో చిరు వ్యాపారులు చేసుకుంటూ బ్రతుకుతున్న సామాన్య ప్రజానీకంపై అధికారులు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారని వారు అన్నారు.

పట్టణ అభివృద్ధి పేరుతో చిరు వ్యాపారుల డబ్బలను, తడకల ను జేసీబీ లతో తొలగించి వారి జీవన ఉపాధి అవకాశాలపై దెబ్బ కొట్టడం సమంజసం కాదని వారన్నారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను అదుకోవాల్సింది పోయి వారిని రోడ్డున పడేయడం నీచమైన చర్య గా వారు అభివర్ణించారు. బంగారు తెలంగాణ లో సామాన్యుడి బ్రతుకుకు భరోసా కరువైందని వారు అన్నారు.

పురపాలక చట్టం లోనే చిరు వ్యాపారులను ఆదుకుని వారికి న్యాయం చేయాలని నిబంధన ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా రోడ్డున పడేసారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. తక్షణమే చిరు వ్యాపారులను, నిరుపేద కుటుంబాలను ఆదుకుని వారికి గతంలోని మాదిరిగా వ్యాపార ఉపాధి మార్గాన్ని చూపాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొల్లాపూర్ మున్సిపల్ శాఖ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కంటే శివన్న, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరశురాముడు, మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు రఫియోద్దిన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంతారావు, పరశురాము యాదవ్ పాల్గొన్నారు.

ఇంకా మధు, చెన్నయ్య, క్రాంతి కుమార్, చిన్న కురుమయ్య, ఎల్లూరు గ్రామ మాజీ సర్పంచ్ నిమ్మల నరసింహ, యన్మాన్ బెట్ల గ్రామ పార్టీ అధ్యక్షుడు మంచాల పుల్లయ్య, మంచాల నరేష్, బాబా, నాగమణి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

రాష్ట్రపతి సెక్యూరిటీ సిబ్బందిలో కరోనా కలకలం

Sub Editor

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు కరోనా

Satyam NEWS

భార్యపై డంబెల్ తో దాడిచేసిన శాడిస్టు భర్త

Satyam NEWS

Leave a Comment