23.2 C
Hyderabad
May 7, 2024 23: 03 PM
Slider ఖమ్మం

ఫుల్లుగా తాగి మీడియాకు దొరికిన మధిర అధికారులు

Madhira Guesthouse

కరోనాను పారద్రోలాలంటే ఏం చేయాలి? ఏం చెయ్యక్కర్లేదు భయ్, ఫుల్లుగా తాగితే అదే పరారైపోతుంది. తెలియదా? కావాలంటే ఖమ్మం జిల్లా మధిర తహసీల్దార్ ను, వీఆర్వోను, ఈవోను అడగండి చెబుతారు. ఎందుకంటే వాళ్లు అదే చేస్తున్నారు.

ఇంటి దగ్గర మందు తాగితే కరోనా పోదని మధిర రెవెన్యూ గెస్ట్ హౌస్ ను బార్ గా మార్చిమరీ పూటుగా తాగుతున్నారు. మధిర తహసీల్దార్ సైదులు, మాటూరు వీఆర్వో గంటా శ్రీను, ఈవో ఆర్ డి రాజారావు, సబ్ జైలర్ ప్రభాకర్ రెడ్డి, మాటూరు పేట పిహెచ్సి డాక్టర్ శ్రీనివాస రావు గెస్ట్ హౌస్ లో తప్పతాగి తూలుతూ ఎంజాయ్ చేస్తుండగా మీడియా కంట పడ్డారు.

 మీడియా ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో తాసిల్దార్ సైదులు, ఈవో ఆర్ డి రాజారావు పరారు కాగా, బాత్రూంలో దాక్కున్న సబ్ జైలర్ ప్రభాకర్ రెడ్డి మీడియాను తోసుకుంటూ రోడ్డుపై ఉడాయించాడు.

మాటూరుపేట పి,.హెచ్.సి డాక్టర్ శ్రీనివాస్ మంచం కింద దాక్కొని పోలీసులకు దొరికిపోయాడు. డాక్టర్ ను అదుపులోకి తీసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారి వాహనాలైన ఓ కారు, రెండు బైక్ లు సీజ్ చేశారు. వీరికి మద్యం ఎక్సైజ్ సీఐ సప్లై చేస్తుండం గమనార్హం. దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండి కరోనాపై పోరాటం చేస్తుంటే బాధ్యత గల వీరంతా ఇలా మందు కొడుతుండటం ఆశ్చర్య పరుస్తున్నది. వీళ్లా ప్రభుత్వ అధికారులు?

Related posts

ట్విట్టర్ ఉంది కదా అని పెట్రేగిపోతే ఎలా…?

Satyam NEWS

40 ఏళ్ల ఆటోనగర్ వాసులు కల నెరవేర్చిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి

Satyam NEWS

ఖరీఫ్ సాగుకు సన్నద్ధం చేయడంలో ప్రభుత్వం విఫలం

Bhavani

Leave a Comment