31.2 C
Hyderabad
May 3, 2024 02: 50 AM
Slider పశ్చిమగోదావరి

రహదారిని కంపోస్టు యార్డ్ గా మార్చేసిన గ్రామ పంచాయతీ

#eluru road

పశ్చిమగోదావరిజిల్లా ఏలూరు పట్టణం లో  పారిశుధ్యం లోపించింది అనడానికి ఇదొక నిదర్శనంగా కనిపిస్తుంది.

ఏలూరు లోని సత్రం పాడు నుండి గెత్సేమనే క్రిస్టియన్ మినిస్ట్రీస్ ఎదురు గా ఉన్న రోడ్ నుండి చింతమనేని కాలనీ మీదగా ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్ కి వెళ్లే రహదారి లో సివిల్ కాంట్రాక్టర్ రవిచంద్ర ఆఫీస్ దగ్గర రహదారి కంపోస్టు యార్డ్ గా మార్చేశారు.

ఆ రోడ్ ఏ పంచాయతీ పరిధి లోదో తెలియదు గాని ఆ రోడ్ వెంట వెళ్లే వారికి అక్కడకు వెళ్ళగానే దుర్గంధం తో కూడిన కుళ్లు వాసన కడుపులో తిప్పేసి వాంతి అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ ప్రాంత ప్రజలు ఆ దుర్గంధాన్ని ఎలా భరిస్తున్నారో తెలియదు.

ఎవరికి వారే మాకెందుకులే అనుకుంటూ కాలం గడిపేస్తున్న పరిస్థితి. అసలే కరోనా సెకండ్ వేవ్ తో ప్రజలు ముక్కు నోరు మూసుకు తిరుగుతున్నారు.

ఇటువంటి పరిస్థితులలో పదిమంది నివసిస్తూ ఆ రహదారి లో నడుస్తుంటే ఆ రహదారిని కంపోస్టు యార్డ్ గా మార్చి పంచాయతీలో ఉన్న చెత్త ను ఆ రహదారిలో వేయడం ప్రజల ప్రాణాలతో చేలాగాట మాదడమే ననీ ఆ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఆ రహదారిపై వేసిన చెత్తను తొలగించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.

Related posts

వెరైటీ ప్రోగ్రాం: బాలక్ భీమ్ బనో పోస్టర్ విడుదల

Satyam NEWS

గ్రాడ్యుయేట్ ఓటర్ గా పేరు నమోదు చేసుకున్న కేటీఆర్

Satyam NEWS

నిత్యావసర వస్తువుల పంపిణీ సద్వినియోగం చేసుకోండి

Satyam NEWS

Leave a Comment