26.7 C
Hyderabad
May 12, 2024 10: 26 AM
Slider నల్గొండ

బడి బాటలో భాగంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం

#badibata

బడి బాట కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఎంపిపిఎస్ ముత్యాలమ్మ వీధి,ఎం పి యు పి ఎస్ మాధవ రాయనిగూడెం నందు సోమవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపిపి గూడెపు శ్రీనివాస్,మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లీ అర్చన రవి,వైస్ చైర్ పర్సన్ జక్కుల నాగేశ్వరరావు,మండల విద్యాధికారి భూక్య సైదా నాయక్ హాజరై పాఠశాలలో సంయుక్తంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని పాఠశాలలో నమోదైన ఒకటవ తరగతి విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని,గ్రామస్తులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విద్యా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ప్రభుత్వ పరిధిలో పాఠశాలలకు ఏ విధమైన సహాయ సహకారాలు కావలసి ఉన్నా తమ వంతు కృషి చేస్తామని అన్నారు.మండలంలో ఎక్కువ విద్యార్థుల నమోదు అయిన పాఠశాల ప్రధానోపాధ్యాయులను అభినందించారు.

ప్రభుత్వ ఉపాధ్యాయుల కృషి చాలా అనిర్వచనీయమైనదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు షర్మిల కుమారి, సూరేపల్లి దేవుడు,కౌన్సిలర్లు కె ఎల్ యన్ రావు,ఎస్ఎంసి చైర్మన్ లు,సభ్యులు, ఉపాధ్యాయులు కళావతి,స్వర్ణలత, భూషణ్ బాబు,ఆడమ్ కుమార్,కవిత, అంగన్వాడీ టీచర్లు,సి ఆర్ పి సైదులు, గ్రామ పెద్దలు,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఎంపి అరవింద్ పై నిరసనగా టీఆర్ఎస్ లో చేరిన బిజెపి నేతలు

Satyam NEWS

ఏపిలో జిల్లాల పెంపుపై తెలంగాణ అసెంబ్లీలో ప్రకటన

Satyam NEWS

డాక్టర్ సుధాకర్ పైనా ఎఫ్ఐర్ నమోదు చేసిన సీబీఐ

Satyam NEWS

Leave a Comment