28.7 C
Hyderabad
April 28, 2024 08: 24 AM
Slider ప్రత్యేకం

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు

#uttamkumarreddy

మాజీ పి.సి.సి అధ్యక్షుడు,నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నల్లమాద ఉత్తంకుమార్ రెడ్డి జన్మదినం హుజూర్ నగర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు అధ్యక్షతన సోమవారం ఎన్ ఎస్ పి క్యాంపు స్కూల్ లో ఒకటవ తరగతి నుండి 4వ తరగతి వరకు 150 మంది పేద విద్యార్థులకు స్వీట్స్, నోటు పుస్తకాలు, పెన్నులు, పలకలు, బలపాల ప్యాకెట్స్ అందచేశారు.

కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ భారీ కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యుడు యరగాని నాగన్న గౌడ్, మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్, మాజీ జడ్పిటిసి  గల్లా వెంకటేశ్వర్లు,పార్టీ సీనియర్ నాయకులు బాచిమంచి గిరిబాబు మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి  యుక్త వయసులోనే మిలటరీలో పనిచేసి క్రమ శిక్షణ కలిగిన వ్యక్తిగా నీతి, నిజాయితీలతో రాజకీయ ప్రయాణం సాగిస్తున్నారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేశారని, ఎత్తిపోతల పథకాలతో బీడు భూములను సస్యశ్యామలం చేయడానికి ఎన్నో లిఫ్ట్లు ఏర్పాటు చేశారని అన్నారు.

610 జిఓ చైర్మెన్ గా తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక పోషించారని, గాంధీ కుటుంబ సన్నిహితుడిగా కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలంలో ఆరు సంవత్సరాలు పిసిసి అధ్యక్ష పదవితో కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తలలో ధైర్యం నింపుతూ పార్టీకి అండగా ఉన్నారని తెలిపారు. ఉత్తమ్ హయాంలో  హుజూర్ నగర్,కోదాడ నియోజక వర్గాలను  అభివృద్ధిలో రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉంచారని అన్నారు. అలాంటి మహా నేత జన్మదినం జరుపుకోవడం చాలా సంతోష దాయకమని, తామంతా ఉత్తమ్ వెన్నంటి ఉండి  కష్ట సుఖంలో భాగస్వాములము అవుతామని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ సెల్ ఉపాధ్యక్షుడు సుంకర శివరామ్ యాదవ్, కౌన్సిలర్లు కోతి సంపత్ రెడ్డి,తేజావత్ రాజా నాయక్,పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడవల్లి వీరబాబు,మైనార్టీ నియోజకవర్గ వర్కింగ్ అధ్యక్షుడు షేక్ సైదా మేస్త్రి,పార్టీ వార్డు కమిటీ అధ్యక్షుడు  కోల్లపూడి యోహాన్,మేళ్ళచెరువు ముక్కంటి,పాశం రామరాజు,పోతన బోయిన రామ్మూర్తి, వెలిదండ వీరారెడ్డి, కారంగుల వెంకటేశ్వర్లు,బొల్లెదు జైలు, ముషం సత్యనారాయణ,లచ్చిమల్ల నాగేశ్వరరావు, సులువ చంద్రశేఖర్,వేముల నాగరాజు,పల్లపు పెద్దబ్బాయి,దొంతగాని జగన్,తేప్పని యలమంద,సలిగంటి జానయ్య,జింజిరాల సైదులు,అంజనవరపు సుదర్శన్,కాస్తాల సైదులు,ఫరీద్, పాలకూరి లాలు,మైపాల్,దాసరి రాములు,గడ్డం అంజయ్య పాశం నారాయణ, చిమట సైదులు, బాలస్వామి,క్యాంప్ స్కూల్ టీచర్  శాంతి,ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

శ్రీశైలంలో కరివెన నిత్యాన్నదాన సత్రం నూతన భవనానికి శంఖుస్థాపన

Satyam NEWS

ప్రతి పంటకు మద్ధతు ధర లభిస్తుంది

Satyam NEWS

అంచనాలు పెంచిన సుధీర్ బాబు ‘హంట్’ టీజర్

Satyam NEWS

Leave a Comment