28.7 C
Hyderabad
April 28, 2024 04: 57 AM
Slider నిజామాబాద్

ఎంపి అరవింద్ పై నిరసనగా టీఆర్ఎస్ లో చేరిన బిజెపి నేతలు

#Armoor TRS Party

పసుపు బోర్డు ఏర్పాటుపై కప్పదాటు వైఖరి అవలంబిస్తున్న నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అర్వింద్ చర్యలకు నిరసనగా బిజెపి నుంచి నేతలు నిష్క్రమిస్తూనే ఉన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో మాక్లూర్ మండలానికి చెందిన బిజెపి ఎంపీటీసీ లు నేడు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

బిజెపిలో సరైన నాయకత్వం లేదని వారు అన్నారు. పసుపు బోర్డుపై ఎంపి అర్వింద్ ఏ మాత్రం నోరు విప్పడం లేదని వారు అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నాయకత్వంలో తమ గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకుంటామని వారు చెప్పారు.

టీఆర్ఎస్ లో చేరిన వారిలో అమ్రాద్ గ్రామ ఎంపిటిసి లక్ష్మి శ్రీనివాస్, గొట్టిముక్కల గ్రామ ఎంపీటీసీ సత్య గాంగు రమేష్, గుంజిలి  గ్రామ ఎంపీటీసీ సుజాత నవీన్, ఇసపల్లి గ్రామ (ఆర్మూర్ మండలం)  ఎంపీటీసీ లినిత మహేష్ ఉన్నారు. వీరిని ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు.

Related posts

న్యూ వైరస్:బ్రెజిల్లో కొత్త వైరస్‌ యారాగా నామకరణం

Satyam NEWS

అంబర్ పేట్ లో ఘనంగా స్వామి వివేకానంద జయంతి

Satyam NEWS

స్థానిక సంస్థల ఎన్నికలపై గవర్నర్ తో ఎస్ఈసీ భేటీ

Satyam NEWS

Leave a Comment