29.7 C
Hyderabad
April 29, 2024 09: 06 AM
Slider మహబూబ్ నగర్

తెలంగాణ ఎస్సీ,ఎస్టీ కమిషన్ నుండి నాగర్ కర్నూల్ ఎస్పి కి నోటీసులు

#kollapurpolice

అవుట చైతన్య ఫిర్యాదుతో స్పందించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్ర పట్టణానికి చెందిన  అవుట చైతన్య పిర్యాదుపై తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ స్పందించింది. గత ఏడాది 2021 జూన్ 2వ తేదీన  ఉదయం ఫోన్ చేసి కొల్లాపూర్ ఎస్ఐ జి. బాల వెంకట రమణ  తన భర్త అయిన అవుట రాజశేఖర్ (జర్నలిస్టు)ను పోలీస్ స్టేషన్ కు పిలిపించుకున్నారని అవుట చైతన్య తన పిర్యాదులో పేర్కొన్నారు.

మధ్యాహ్నం అయిన సరే తన భర్త ఇంటికి రాకపోవడంతో మధ్యాహ్నం మూడున్నర గంటలు దాటిన తరువాత తన పిల్లలతో కలిసి పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లానని అవుట చైతన్య తెలిపారు. అక్కడకు వెళ్లిన తనకు తన భర్త బాధతో అరుస్తున్న అరుపుల శబ్ధం వినిపించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను మరింత దగ్గరగా వెళ్లగా తన భర్త అరుపులు ఎస్ ఐ ఆఫీస్ నుండి వస్తుండడంతో గమనించి ఎస్ఐ ని ప్రశ్నించానని ఆమె తెలిపింది.

తాను అడిగినా కూడా ఎస్ఐ తనను తన పిల్లలను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని ఆమె తన ఫిర్యాదులో తెలిపింది. తనను తన భర్తను ఉద్దేశించి రాయలేని మాటలతో, తన కులం పేరు ఉపయోగించి  దూషించారని ఆమె వివరించింది. ‘‘కులం తక్కువ మాల దానా… పోలీస్ లనే ప్రశ్నిస్తావా’’ అంటూ రాయలేని మాటలు మాట్లాడారాని, కానిస్టేబుల్ శివ కుమార్, రవి కుమార్ కూడా తనను అసభ్యంగా దూషించారానీ పిర్యాదులో తెలిపింది.

తనను భయంబ్రంతులకు గురిచేస్తూ పోలీసు స్టేషన్ గేటు బయటికి వెళ్లగొట్టారని పిర్యాదులో వివరించింది. అన్ని పరిస్థితులు గమనించిన తర్వాత తన కుటుంబానికి పోలీసుల నుంచి ప్రాణ హాని ఉందని అవుట చైతన్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోలీస్ స్టేషన్ లో ఉన్న సీసీ కెమెరాలలో ఇది అంతా రికార్డు అయి ఉండవచ్చునని, ఎస్ఐ జి. బాల వెంకట రమణ వాటిని ఉద్దేశ్యపూర్వకంగా ధ్వంసం చేసి ఉండకపోతే అవి ఇంకా ఉండి ఉంటాయని కూడా ఆమె తెలిపారు. ఈ విషయాలన్నీ అవుట చైతన్య తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్ లో దారుణంగా హింసించిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది.

కులం పేరుతో దూషించి తనను తీవ్ర మానసిక ఆవేదనకు గురి చేసిన పోలీసులపై స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తనకు చట్ట పరంగా న్యాయం చేయాలని 2022 జూన్ 7వ తేదీన ఫిర్యాదు ద్వారా కోరింది. దీనికి కమిషన్ స్పందించింది. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు కు సంబంధించిన ఫిర్యాదుపై వాస్తవాలపై విచారణ జరపాలని శనివారం నాగర్ కర్నూల్  జిల్లా  ఎస్పీకి  తెలంగాణ ఎస్సీ, ఎస్టీ  కమిషన్ నోటీసులు జారీ చేసింది.

Related posts

13 అడుగుల కొండచిలువ హల్ చల్

Murali Krishna

గురుదేవోభవ

Satyam NEWS

ఈ సాయంత్రం విజయవాడలో రామ్ లాల శోభాయాత్ర

Satyam NEWS

Leave a Comment