33.2 C
Hyderabad
May 4, 2024 02: 12 AM
Slider మహబూబ్ నగర్

శాంతియుత వాతావరణంలో బక్రీద్ వేడుకలు జరుపుకోవాలి

#Gadwal SP

బక్రీద్ వేడుకలు ఈద్గాల వద్ద కోవిడ్ నిబంధనలకు లోబడి నిర్వహించేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జోగుళాoబ గద్వాల్ జిల్లా ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్ చెప్పారు.  

మంగళవారం జిల్లా కేంద్రంలోని ఉండవెల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించి  బక్రీద్ పండుగ భద్రత ఏర్పాట్లు ను అలంపూర్ సర్కిల్ సి. ఐ. వెంకట్రామయ్యని అడిగి తెలుసుకున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.

పోలీస్ స్టేషన్ పరిధిలో  నేను సైతం కార్యక్రమం ద్వారా ప్రజలలో చైత్యనం  తీసుకువచ్చి గ్రామాలలో సి.సి కెమెరాల ఏర్పాటు కృషి చేయినందుకు ఎస్సై జగన్ మోహన్ ని, పోలీస్ సిబ్బందిని అభినందించారు. సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయడం వల్ల గ్రామాల్లో జరిగే నేరాలను తక్కువ సమయంలోనే  పరిష్కరించవచ్చు అని అన్నారు.

అలాగే పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను తనిఖీ చేసి సీజ్ చేసిన వాహనాల వివరాలు తెలుసుకున్నారు. పోలీస్ సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ నేరాలను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.

అనంతరం మాట్లాడుతూ జిల్లాలో బక్రీద్ పర్వదిన సందర్బంగా అన్ని ఈద్గాల వద్ద అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని, ముఖ్యంగా కోవిడ్ నేపథ్యంలో విధిగా మాస్కులు ధరించడం, ప్రార్ధన స్థలాల లో భౌతిక దూరం పాటించాలని తెలిపారు.

గద్వాల్ జిల్లా హిందు, ముస్లిం పండుగలను ఐకమత్యంగా నిర్వహించుకుంటూ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నదని గుర్తు చేశారు. శాంతియుత వాతావరణంలో జిల్లాలో బక్రీద్ పండుగ జరుపుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ముస్లింలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే  బక్రీద్ పండుగ   ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 

అలంపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రామయ్య, ఉండవెల్లి ఎస్సై జగన్ మోహన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

సెలూన్ హెయిర్ క్రష్ లో సెలెబ్రిటీల సందడి

Satyam NEWS

నెల్లూరు కోర్టు చోరీ కేసులో ఎలాంటి సంబంధం లేదు

Satyam NEWS

పేద రైతుల భూములు లాక్కోవద్దు

Satyam NEWS

Leave a Comment