40.2 C
Hyderabad
April 26, 2024 12: 30 PM
Slider నల్గొండ

పేద రైతుల భూములు లాక్కోవద్దు

#CPMNalgonda

ఇండస్ట్రీయల్ పార్క్ పేరుతో పేద రైతుల భూములను బలవంతంగా తీసుకుంటే సహించేది లేదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి అయిలయ్య, సీపీఎం జిల్లా నాయకులు జిట్ట నగేష్  ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో శుక్రవారం నాడు వ్య.కా.సం, సీ.పీ.యం. ల  ఆధ్వర్యంలో   సర్వే నెంబరు 418,తోపాటు  ఇతర భూములను పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు కు వ్యవసాయానికి నిరుపయోగంగా ఉన్న రాళ్ళ, బోళ్లు,గుట్టలు  వంటి భూములను తీసుకోవాలని కోరారు.

బలవంతపు భూ సేకరణ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని అన్నారు. పేదల భూములను తీసుకోవాలనే ప్రభుత్వ యోచన విరమించుకోకపోతే రాజకీయాలకు అతీతంగా వివిధ రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాల నాయకులు, ప్రతినిధులను కలుపుకొని  దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.

వెలిమినేడు అసైన్డ్ భూములను తీసుకొనే బదులు డేరా బాబా, రాంకీ సంస్థల వంటి భూములను తీసుకోవాలని, ప్రతి పేద కుటుంబానికి మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇస్తామన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మాట నీటి మూటలుగానే ఉన్నాయని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొజ్జ చినవెంకులు, రాష్ట్ర కమిటీ సభ్యులు కత్తుల లింగస్వామి, అరూరి శీను, నరసింహ, యం. పీ.టీ.సీ మెంబరు దేశబోయిన స్వరూప పాల్గొన్నారు.

ఇంకా, సీ.పీ.ఐ.యం. నాయకులు మల్లం మహేష్, అరూరి శంభయ్య, దేశబోయిన నర్సింహ, వివిధ ప్రజా సంఘాల నాయకులు బొడ్డుపల్లి శీను, గుర్రం జంగయ్య, కోరగోని రామచంద్రం, అరూరి శివ,కొండె మాధవి, చిన్నం అనితారాణి, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ కు 50 కోట్లు విడుదల

Satyam NEWS

64 కళలూ పండిన మాయాబజార్ కు 64 ఏళ్లు నిండాయి!

Satyam NEWS

అరాచకపాలనకు వ్యతిరేకంగా లోకేష్ తొలిఅడుగు

Bhavani

Leave a Comment