33.7 C
Hyderabad
April 30, 2024 02: 14 AM
Slider గుంటూరు

29 వేల మంది ఆడబిడ్డల ఆచూకీ పై ఆరా తియ్యండి

#balakotaiah

ప్రభుత్వం జవాబుదారీగా లేనప్పుడు, ప్రశ్నించే గొంతుకల నోళ్ళు నొక్కుతున్నప్పుడు రాజ్యాంగబద్ధమైన సంస్థలు, ప్రజలకు అండగా ఉండాల్సిన మీడియా సంస్థలు బాధ్యత  పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అమరావతి  బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య  అభిప్రాయపడ్డారు. ఆయన కేంద్ర,రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లకు, ఈటీవీ, ఏబీఎన్, టీవీ ఫైవ్, మహా న్యూస్,టీవీ9, ఎన్టీవి, 99 టివి వంటి  రెండు తెలుగు రాష్ట్రాలలోని అన్ని మీడియా ఛానళ్ళ యజమానులకు ఈమెయిల్ ద్వారా లేఖలు పంపారు. 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏలూరులో జరిగిన వారాహి యాత్రలో 2019 – 2021 కాలంలో రాష్ట్రంలో 29,279 మంది ఆడబిడ్డల ఆచూకీ కనిపించటం లేదని, వీరిలో 18 సంవత్సరాలు నిండని ఆడపిల్లలు 7001 మంది, 18 సంవత్సరాలు  పైబడిన  ఆడవాళ్లు 22,278 మంది ఉన్నారని చెప్పినట్టు పేర్కొన్నారు.  కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకే ఈ అంశం తెలిసిందని చెప్పారు అన్నారు. అయినా ప్రభుత్వం లో ఇసుమంతైనా  స్పందన లేదని, అసలు విషయాన్ని మరుగున పరిచేందుకు కొసరు విషయం వాలంటీర్ల అంశాన్ని తెరపైకి తెచ్చి భూమ్యాకాశాలు బద్దలయ్యేలా ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.

బాధ్యత కలిగిన హోంమంత్రి కానీ, డిజిపి కానీ సమాధానం చెప్పలేదని అన్నారు. మహిళల మిస్సింగ్ పై నోరు మెదప లేదన్నారు. మహిళా కమీషన్ పవన్ కళ్యాణ్ కు నోటీసులు ఇస్తే, మిస్సింగ్ మహిళలు ఇంటికి రాలేరని, డిజిపి కి నోటీసులు ఇస్తేనే ఇళ్ళకు వచ్చే అవకాశాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. రాజ్యాంగపరమైన కేంద్ర , రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.  ప్రజల పక్షం వహించే మీడియా ఛానళ్ళు, పత్రికలు కూడా దయనీయమైన మహిళల అదృశ్యాలపై ఆరా తీయాలని,   ప్రభుత్వ రాజకీయ ఎత్తుగడలను వమ్ము చేయాలని కోరారు. ఏపీలో ఇప్పటి వరకు ఎంతమంది మహిళలు మిస్ అయ్యారు?  మిస్సింగ్ కు కారణాలు ఏమిటి? ఎంత మంది ఇళ్ళకు వచ్చారు? తీసుకుంటున్న చర్యలు ఏమిటి? అన్న విషయాన్ని ప్రజలకు తెలియపర్చాలని తెలిపారు. బాధ్యత కలిగిన మీడియా, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, జాతీయ మీడియా జోక్యం చేసుకోవాల్సిన అవసరమూ ఉందని బాలకోటయ్య స్పష్టం చేశారు.

Related posts

గుర‌జాడ విశ్వ‌విద్యాల‌య స్థాప‌న‌: విద్య‌, ఉద్యోగావకాశాలకు మేలిమ‌లుపు

Satyam NEWS

మీరు మా సినిమా చూడండి…మేము మీ సినిమా చూస్తాం…

Satyam NEWS

గిరిజన యూనివర్సిటీని వెంటనే ప్రారంభించాలని డిమాండ్

Bhavani

Leave a Comment