26.7 C
Hyderabad
May 3, 2024 07: 49 AM
Slider కవి ప్రపంచం

అంతర్మథనం

#Sandhya Sutrave New

లోలోన ఆలోచనల

పర్వం సాగుతుంది

భావాల పరంపరను తోడుతూ

ఫోటోపై ఫోటో ప్రింటులా

అనేకానేక ఊహల ఊసులు

ఊపందుకుంటున్నాయి

ఎంపిక అసాధ్యమే ఐనా!

ఎక్కడో ఫుల్ స్టాప్ కామాలా

లీలగా ఒకానొక స్థితిలో స్థిరీకరణ

కలం కదలికతో మొదలు

భావాల రూపకల్పన

కొన్ని సార్లు టైటిల్ కోసం

ఇంకొన్ని సార్లు టాపిక్ కోసం

కసరత్తు షురూ

నాగరికత నాణ్యత నవీనత

సాంకేతికత ప్రయోగాత్మకత

సూచన వర్ణనల జోడింపులతో

కూడిన సమయోచిత కసరత్తుకు

ప్రతిఫలం ప్రతిరూపును

చూసినంతనే

నూతనోత్సాహంతో

మరోరచనకు స్ఫూర్తీ,

అన్వేషణా కొనసాగు

అనేకానేక బాధ్యతల

బంధీగా ఉన్నా ఈ కాస్త

శోధన సాధన‌ మనసుకు

నిచ్చు ప్రశాంతత

ఈ అభిరుచి ఇలాగే

కొనసాగించాలనే ఆకాంక్ష ఆతురత

సంధ్య సుత్రావె, ఫోన్: 9177615967

Related posts

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరాసింహునికి సాయి కొర్రపాటి భారీ విరాళం

Satyam NEWS

బతికి ఉంటే కదా మిత్రమా మతాచారాలు పాటించేది?

Satyam NEWS

కేసీఆర్, కేటీఆర్ లపై అసభ్య వీడియో పెట్టినవారి అరెస్టు

Satyam NEWS

Leave a Comment