బిబినగర్ AIMS కళాశాలకు బోర్డ్ మెంబెర్ గా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాష్ ను నియమిస్తూ కేంద్రం ప్రభుత్వం నేడు ప్రకటన విడుల చేసింది. దేశంలోని ప్రతిష్టాత్మకమైన సంస్థ అయిన ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIMS)కు 8 మంది బోర్డ్ మెంబర్లను నియమించారు.
అందులో తెలంగాణకు సంబంధించిన బిబినగర్ AIMS కు బోర్డ్ మెంబెర్ టి.ఆర్.ఎస్. పార్టీ రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బండా ప్రకాష్ ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక బులిటెన్ విడుదల చేసింది. బండా ప్రకాష్ ప్రస్తుతం నేషనల్ MSME బోర్డ్ మెంబెర్ గా, లేబర్, కామర్స్ & ఇండస్ట్రీ, OBC పార్లమెంటరీ కమిటీలకు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.