31.2 C
Hyderabad
May 3, 2024 02: 58 AM
Slider నల్గొండ

శ్రమజీవుల హక్కులను హరిస్తున్న కేంద్రం

#CITU Hujurnagar

శ్రమజీవుల హక్కులని హరించే నిర్ణయం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని, దీనికి వ్యతిరేకంగా కార్మికులు, ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు ఐక్యంగా పోరాడటానికి సమాయత్తం కావాలని జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షుడు శీతల రోషపతి పిలుపునిచ్చారు.

హుజూర్ నగర్ పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు గుండా రామ నాగేశ్వరరావు, సింగిరి కొండ శ్రీను కు 3/7/2020 దేశవ్యాప్తంగా జాతీయ సంఘాలు నిరసనలు, ఆందోళనలు పిలుపులో భాగంగా సెలవు నోటీస్ ఇచ్చిన అనంతరం రోశపతి మాట్లాడుతూ అనేక సంవత్సరాలు పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను హరించి ఎనిమిది గంటల పని విధానాన్ని 12 గంటలు చేయాలని చూడటం, కరోనా కేసులు పెరిగిన విధంగా ప్రతిరోజు పెట్రోల్ ,డీజిల్ రేట్లు పెంచటం మూలంగా నిత్యావసర ధరలపై ప్రభావం రైతులపై పడుతుందని ఆయన అన్నారు.

తక్షణమే చట్టాల సవరణ పని గంటలను పెంచే విధానాన్నివిరమించుకోవాలని, కరోనా కాలంలో అసంఘటిత రంగాలలోని కార్మికులకు ప్రతి నెల 7500 రూపాయలు ఆరు నెలలు ప్రతి కుటుంబానికి, భీమా ఉచితంగా ప్రభుత్వమే ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కుక్కడపు కోటేశ్వరరావు, ఐ ఎన్ టి యు సి నాయకులు జానయ్య, ఎస్ సైదులు సిఐటియు నాయకులు గుండెబోయిన వెంకన్న, కొమ్ము రాములు, ఐ ఎఫ్ టి యు నాయకులు గురవయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ లో రేపటి నుంచి స్కూళ్లు బంద్

Satyam NEWS

మాస్కులు, గ్లౌజులు తప్పని సరిగా ధరించాలి

Satyam NEWS

రేపు తొలి ఏకాదశి పర్వదినం: ఆ రోజు ఏం చేయాలంటే….

Satyam NEWS

Leave a Comment