41.2 C
Hyderabad
May 4, 2024 15: 13 PM
Slider హైదరాబాద్

కొండగట్టులో కేసీఆర్ కుటుంబం భూముల దందా…!

#bandisainjai

కొండగట్టు ఆలయ అభివ్రుద్ది కోసం రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేయడానికైనా వెనుకాడేది లేదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు.  కొండగట్టు ప్రాంత పరిసరాల్లో  కేసీఆర్ కుటుంబం పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. యాదగిరిగుట్ట ఆలయ అభివ్రుద్ధి విషయంలోనూ ఆ పరిసరాల్లో పెద్ద ఎత్తున భూదందా చేసి వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. 

వేములవాడ ఆలయ అభివ్రుద్ధికి 500 కోట్లు, ధర్మపురి ఆలయ అభివ్రుద్దికి 100 కోట్లు ఇస్తానన్న హామీని ఇంతవరకు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. ప్రజా గోస – బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా హస్తినాపురంలో జరిగిన ‘స్ట్రీట్ కార్నర్ మీటింగ్’’లో బండి సంజయ్ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షులు సామ రంగారెడ్డి తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇండ్ల ఆశ చూపి లక్షలాది మంది ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ సర్కార్ తీరును ఎండగట్టేందుకే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నామని… నిరుద్యోగ భ్రుతి, ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ మోసాలను యువతకు తెలియజేసేందుకే ఈ మీటింగ్ నిర్వహిస్తున్నామని బండి సంజయ్ స్పష్టం చేశారు.

కరెంట్, ఆర్టీసీ ఛార్జీలతోపాటు ఆస్తి పన్నులు, నీటి పన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నరు. మళ్లీ కరెంట్ ఛార్జీలు పెంచబోతున్నరని…. ప్రజలపై మోయలేని భారం మోపబోతున్నరని… పీఆర్సీ అమలు చేయకుండా ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నరని పార్టీ అధ్యక్షుడు ఆరోపించారు.ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇవ్వకుండా, యువతకు ఉద్యోగాలివ్వని కేసీఆర్ తన కుటుంబానికి మాత్రం అందరికీ ఉద్యోగాలిచ్చుకున్నడని ఆరోపించారు.టీచర్లకు ప్రమోషన్లు లేవు. స్పౌజ్ బదిలీల్లేవు. డీఎస్సీ వేయలేదని…. 30 వేల పోస్టులు ఖాళీగా ఉన్నయని… 317 జీవోతో చెట్టుకొకరు పుట్టకొకరిని చేశారు.

ఇదేమని ప్రశ్నిస్తే దాడులు చేయిస్తున్నరని.. నాతోసహా ఎంతోమంది టీచర్లను అరెస్టులు చేసి జైలుకు పంపారు. కేసీఆర్ వల్ల 15 మంది టీచర్లు ఆత్మహత్య చేసుకున్నడని ఆరోపించారు.టీచర్లంటే కేసీఆర్ కు కసి. వాళ్లకు ఎన్నికల డ్యూటీ వేయకుండా ఇబ్బంది పెట్టిన మూర్ఖుడు. టీచర్ల శాపం కేసీఆర్ కు తగులుతోంది. పేదల ఉసురు తగిలి కేసీఆర్ డౌన్ ఫాల్ స్టార్టయ్యింది. ఇది తెలిసే కేసీఆర్ తాంత్రిక పూజలు చేస్తున్నడని ధ్వజమెత్తారు.కేసీఆర్ కుటుంబం కొండగట్టు చుట్టూ పక్కల పెద్ద ఎత్తున భూములు కొన్నడని…. ఇటీవల కేసీఆర్ బిడ్డ కొండగట్టు పోవడం వెనుక భూముల కొనుగోలు కుట్ర ఉందని.. ఆ తరువాతే కొండగట్టును అభివృధ్ధి చేస్తానంటూ,వెయ్యి కోట్లు ఇస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నడని.. యాదాద్రిలోనూ ఇదే తరహాలో భూ దందా చేశారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఆరోపించారు.ధర్మపురిలో 100 కోట్లు ఇస్తానని మాట తప్పారని.. వేములవాడలో 500 కోట్లు ఇస్తానని మోసం చేశారని.. శివరాత్రి వస్తున్నప్పటికీ రాజన్న ఆలయంలో కనీస సౌకర్యాల్లేవని… అయినా పట్టించుకోలేదని బీజేపీ పార్టీ అధ్యక్షుడు అన్నారు

కేసీఆర్ కు ఎందుకు ఓటేయాలి? నిరుద్యోగులను, ఉద్యోగులను, రైతులను, కార్మికులను, మహిళలను మోసం చేస్తున్నందుకు ఓటేయాలా? కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని బండి తీవ్రంగా ఆరోపించారు. ఇప్పటికే రెండుసార్లు కేసీఆర్ ను నమ్మి ఓటేసి మోసపోయామని కరీంనగర్ ఎంపీ ఆవేదన చెందిన. బీజేపీకి ఎందుకు ఓటేయాలంటే….. నరేంద్రమోదీ కరోనా వ్యాక్సిన్ అందించడంవల్లే ఈరోజు అందరం ప్రాణాలతో బయటపడ్డం. రేషన్ బియ్యం ఫ్రీగా ఇస్తోంది మోదీయేనని తెలంగాణకు 2.4 లక్షల ఇండ్లను మంజూరు చేశారని.. గ్రామ పంచాయతీల్లో నిదులన్నీ మోదీగారు ఇస్తున్నవేనని స్పష్టం చేశారు.

పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల అమలుకు నిధులిస్తున్న బీజేపీకి ఓటేయండని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్పష్టం చేశారు.  మునుగోడు ఎన్నికల సందర్భంగా ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో వెయ్యి గజాల లోపున్న ఇండ్లను, రెగ్యులరైజేషన్ చేస్తామని 118 జీవో జారీ చేసి ఓట్లు దండుకున్న కేటీఆర్… ఇయాళ ఆ జీవోను అమలు చేయకుండా మరోసారి మోసం చేస్తున్నడని.. వరదల సమయంలో ఇంటికో 10 వేలు ఇస్తానని మోసం చేసిన దుర్మార్గుడు కేసీఆర్ అని.. ఎందుకు పరిహారం ఇవ్వడం లేదని నిలదీస్తే నాపై ద్రుష్ప్రచారం చేసిన ఘనడు కేసీఆర్ అని కరీంనగర్ ఎంపీ విమర్శించారు.

రాష్ట్రంలో ఏ సర్వే చూసినా బీజేపీ గెలుస్తుందని నివేదికలొస్తున్నయని… బీజేపీని ఓడించడానికి కేసీఆర్ కుట్రలు చేస్తున్నడని… ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్న బీజేపీ నేతలపై దాడులు చేయిస్తూ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నడని. . అయినా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పేదల పక్షాన పోరాడతాం. బీజేపీ అధికారంలోకి వస్తేనే పేదల ప్రభుత్వం ఏర్పడుతుందని.. లేకుంటే బాంచన్ బతుకులవుతాయనే విషయాన్ని అర్ధం చేసుకోవాలని బండి సంజయ్ స్పష్టం చేశారు.

కేసీఆర్ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని.. జాగ ఉన్న వాళ్లకు 5 లక్షలు,3 లక్షలిస్తానని మాట తప్పారని చెప్పారు. స్కూళ్లకు, ఆసుపత్రులకు కనీస సౌకర్యాలు కల్పిస్తామని మాట తప్పారని ఆరోపించారు. స్కూళ్లలో టాయిలెట్లు లేక, చాక్ పీసులకు డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నా పట్టించరకోవడం లేదు.  బీజేపీ అధికారంలోకి వస్తే నిలువ నీడలేక పేదలందరికీ పక్కా ఇండ్లు కట్టిస్తామన్నారు. పేదలందరికీ ఉచితంగా విద్య, వైద్యం అందిస్తామని టీ.బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు.

Related posts

మళ్లీ గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ కేసు నమోదు

Satyam NEWS

హనుమంత వాహనం పై శ్రీ కోదండరామ స్వామిగా సౌమ్యనాధ స్వామి

Satyam NEWS

కరోనాతో మృతి చెందిన కార్మిక నాయకుల సంతాప సభ

Satyam NEWS

Leave a Comment