29.7 C
Hyderabad
May 2, 2024 06: 50 AM
Slider ప్రత్యేకం

తెలంగాణను కించపరిస్తే రాళ్లతో తరిమితరిమి కొడతాం

#bandisanjai

మైనారిటీ పాఠశాలల్లో రోజుకు 5సార్లు నమాజ్ చేసుకుంటూ ఆ మతాన్ని ప్రమోట్ చేసేలా క్లాసులు నిర్వహించుకోవాలంటున్న కేసీఆర్…. అయ్యప్ప, భవానీ, శివ, హనుమాన్ భక్తులను ప్రశాంతగా పూజలెందుకు చేసుకోనివ్వడం లేదు? హిందూ దేవుళ్లను కించపరుస్తుంటే నోరెందుకు మెదపడం లేదు కేసీఆర్.. యువకులారా…. కేసీఆర్ పాలనను బొందపెట్టేదాకా ఉద్యమించండి…బీజేపీ అధికారంలోకి వస్తే పేదల రాజ్యాన్ని తీసుకొచ్చి అభివ్రుద్ధి చెందిన తెలంగాణగా తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్రం లోకొల్లాపూర్ లో పాదయాత్ర ముగింపు బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలివి.

‘‘8 ఏండ్లుగా గ్రామ  పైసా ఇయ్యకుండా నిర్వీర్యం చేయడంతోపాటు కేంద్రం ఇచ్చే నిధులను దొంగిలించిన కేసీఆర్… ఇవాళ గ్రామ పంచాయతీకి 10 లక్షలిస్తానని హాస్యాస్పదం. దొంగలించిన సొమ్మును వడ్డీతోసహా చెల్లించేదాకా సర్పంచులు, వార్డు సభ్యులుసహా ప్రజలు కేసీఆర్ ను క్షమించే ప్రసక్తే లేదు’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. కేసీఆర్ కుటుంబ అవినీతి, అక్రమాలపై కేంద్రం విచారణ చేస్తున్నారనే అక్కసుతోనే టీఆర్ఎస్ నేతలు ప్రధాని మోదీని బదనాం చేస్తున్నారని చెప్పారు.

కేంద్రం తెలంగాణకు పెద్ద ఎత్తున నిధులిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా అవి ప్రజలకు అందకుండా అడ్డుకుంటున్న కేసీఆర్ సిగ్గు లేకుండా కేంద్రాన్ని బదనాం చేసేందుకు బీఆర్ఎస్ పేరుతో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థత, చేతగానితనంవల్లే తెలంగాణ అప్పుల కుప్పగా మారిందన్నారు. మైనారిటీ గురుకుల పాఠశాలల్లో రోజుకు 5 సార్లు నమాజ్ చేసుకోవచ్చని, మతపరమైన క్లాసులు నిర్వహించుకోవచ్చని చెబుతున్న కేసీఆర్ అయ్యప్ప, హనుమాన్, శివ, భవానీ భక్తులు ప్రశాంతంగా పూజలు చేసుకునే వెసులు బాటు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. హిందూ దేవుళ్లను కించపరుస్తున్నా కేసీఆర్ నోరెందుకు మెదపడం లేదని నిలదీశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని, పేదల రాజ్యాన్ని తీసుకొస్తామన్నారు. అభివ్రుద్ధ చెందిన తెలంగాణగా తీర్చిదిద్దే సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు. కేసీఆర్ పాలనను బొంద పెట్టేదాకా యువత విశ్రమించొద్దని, ఈ విషయంలో బీజేపీ చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోరుతూ గత 35 రోజులుగా పాదయాత్ర చేస్తున్న జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆయనతో కలిసి నడిచారు. అనంతరం కొల్లాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభకు బండి సంజయ్ తోపాటు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి, అధికార ప్రతినిధి వీరేందర్ గౌడ్, వనపర్తి జిల్లా అధ్యక్షులు రాజవర్దన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగతా వేలాదిగా తరలివచ్చిన వేలాది మంది ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు…… తెలంగాణకు కేంద్రం నుండి ఏ మంత్రి, అధికారి వచ్చినా నిరంతరం కొల్లాపూర్ అభివృ  ద్ధి కోసం నిధులు తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు సుధాకర్ రావు. వర్షం పడితే ఉసర్లు వస్తయి… ఎన్నికలొస్తేనే టీఆర్ఎస్ నాయకులు వస్తారని అన్నారు.

దేశవ్యాప్తంగా నరేంద్రమోదీ 3.5 కోట్ల ఇండ్లు నిర్మిస్తున్నారని.. తెలంగాణకు 2.4 లక్షల ఇండ్లకు కేంద్రం నిధులు మంజూరు చేస్తే కేసీఆర్ మాత్రం వాటిని పేదలకు అందజేయడం లేదని.. ఈ రాష్ట్రంలో, ఈ నియోజకవర్గంలో లక్షలాది మంది డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నా ఒక్కరికీ  ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదో ప్రజలంతా కేసీఆర్ ను నిలదీయండని అన్నారు.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు.నరేంద్రమోడీ ప్రభుత్వం రెండు నెలల్లో 1.46 లక్షల మందికి అపాయిట్ మెంట్ లెటర్లు ఇచ్చింది. ఈ ఏడాది 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారని బండి సంజయ్ నొక్కి చెప్పారు.

ఇవాళ సిగ్గు లేకుండా గ్రామ పంచాయతీలకు 10 లక్షలు ఇస్తాడట. 8 ఏళ్లు నయాపైసా ఇయ్యకుండా పంచాయతీలను నిర్వీర్యం చేసిన కేసీఆర్… పంచాయతీ నిధులను దారి మళ్లించిన సొమ్ముకు వడ్డీతో సహా చెల్లించాలని… లేనిపక్షంలో సర్పంచులు, వార్డు సభ్యులు సహా గ్రామాల ప్రజలెవరూ కేసీఆర్ ను క్షమించబోరని స్పష్టం చేశారు.తెలంగాణ కేడర్ లో ఎంతోమంది సత్తా ఉన్న అధికారులున్నా వారికి సరైన పోస్టింగులివ్వడం లేదు… ఏపీ క్యాడర్ ను అడ్డుపెట్టుకుని రబ్బర్ స్టాంపులా వాడుకుని అవినీతి సొమ్మను దోచుకుంటున్నరు.  ఇప్పటికైనా హైకోర్టు తీర్పుతో బుద్ది తెచ్చుకుని ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేయాలి. తెలంగాణ క్యాడర్ అధికారులకు పోస్టింగులివ్వాలని కోరారు.

కొల్లాపూర్, తెలంగాణ అభివృ ద్ధికి, రోడ్లకు నిధులివ్వని కేసీఆర్… తన కుటుంబం చేసే లంగా దందాలకు మాత్రం వందల కోట్లు ఇయ్యడం సిగ్గు చేటు. కేసీఆర్ కుటుంబ అక్రమాలపై, తెలంగాణ అభివ్రుద్ధిపై ప్రజల్లో చర్చ జరకుండా ఉండేందుకు బీఆర్ఎస్ పేరుతో డ్రామాలాడుతున్నారని ఆరోపించారు.

బీజేపీ బరాబర్ హిందూ ధర్మరక్షణ కోసం పనిచేస్తుందని.. అందుకోసం ఎంతదాకైనా పోరాడుతుందని.. ఇవాళ జాతీయ యువజన దినోత్సవమని… యువతకు స్పూర్తి ప్రదాత స్వామి వివేకానందుడి జయంతి సందర్భంగా ఆయన స్పూర్తితో కేసీఆర్ పాలనపై చరమ గీతం పాడదామని…. వివేకానంద చెప్పినట్లు యువత ముందుకు రావాలని. . తెలంగాణలో రామరాజ్యం, ప్రజాస్వామ్య ప్రభుత్వం, పేదల రాజ్యం రావాలంటే తెలంగాణలోని యువత పూర్తి సమయం కేటాయిస్తే కేసీఆర్ సంగతి చూస్తామని అన్నారు.

యువతకు న్యాయం జరగాలంటే… ఉద్యోగాలు రావాలంటే… తెలంగాణ అమరుల ఆశయాలు నెరవేరాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని.. అప్పుడే తెలంగాణ అభివ్రుద్ధి సాధ్యం కాదని… టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ లకు అధికారం ఇచ్చారు. ఒక్కసారి బీజేపీకి అవకాశమివ్వండని కోరారు. అభివ్రుద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రంగా మార్చే బాధ్యత మేం తీసుకుంటామన్నారు. తెలంగాణలో రామరాజ్యాన్ని, కాషాయ రాజ్యాన్ని, పేదల రాజ్యాన్ని తీసుకొస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

Related posts

వారసత్వ శిలల పరిరక్షణకు సేవ్ ది రాక్స్

Satyam NEWS

ప్రారంభమైన పోలింగ్

Murali Krishna

హార్డ్ స్టోరీ: కరోనా కబళిస్తున్న జీవితాలు ఇవి

Satyam NEWS

Leave a Comment