30.7 C
Hyderabad
April 29, 2024 06: 45 AM
Slider హైదరాబాద్

వారసత్వ శిలల పరిరక్షణకు సేవ్ ది రాక్స్

#savetherocks

హైదరాబాద్ రాక్‌స్కేప్‌లు, దక్కన్‌ పీఠభూమిలోని విశిష్ట గ్రానైట్ నిర్మాణాల ప్రాముఖ్యత గురించిన పరిజ్ఞానం  పంచుకోవడానికి  సొసైటీ టు సేవ్ రాక్స్ పని చేస్తున్నది. పర్యావరణ కార్యకర్త ఫ్రాక్ ఖాదర్, సొసైటీ టు సేవ్ రాక్స్ వైస్ ప్రెసిడెంట్ సంగీత వర్మ, జీవితకాల సభ్యులు, ప్రొఫెసర్ ఎ.సి.నారాయణ నగరంలో ఉన్న వారసత్వ శిలా ఆవరణలు తెలంగాణలోని శిలల భౌగోళిక అంశాలను గురించి వెల్లడించారు.

రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ప్రైడ్ ప్రెసిడెంట్ అస్మా రజ్వీ మాట్లాడుతూ “శిలల సంరక్షణ కోసం పనిచేస్తున్న సొసైటీ టు సేవ్ రాక్స్, డెక్కన్ రాక్స్ ప్రత్యేకతలపై ఇరవై ఏడు సంవత్సరాలుగా అవగాహన కల్పిస్తోందని తెలిపారు. దక్కన్ శిలలను భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనవిగా పరిగణించారు. దాదాపు 2500 మిలియన్ సంవత్సరాల నాటివి ఇవి. తెలంగాణ ల్యాండ్‌స్కేప్‌లో బ్యాలెన్సింగ్ రాతి నిర్మాణాలు మనోహరమైన అంశం. హైదరాబాద్‌లోని నీటి మట్టం, వృక్షజాలం మరియు జంతుజాలంపై శిలలు ఎలా ప్రభావం చూపుతాయో గమనించడం ఆసక్తికరంగా ఉందని అన్నారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ చైర్మన్ అనిల్ కుమార్ ఏపూర్ సొసైటీ చేస్తున్న కృషిని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం చురుకైన ప్రమేయంతో ఇంకా చాలా చేయవలసి ఉందని ఉద్ఘాటించారు. రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ప్రైడ్ అధ్యక్షురాలు అస్మా రజ్వీ, సెక్రటరీ ఫాతేమా తాహెర్‌తో పాటు నగర సౌందర్యం పట్ల అమిత ఆసక్తి కలిగిన వ్యక్తులు ఈ  సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

మరిన్ని వివరాల కోసం, దయచేసి కాల్ చేయండి : అస్మా రజ్వీ, 8374716648

Related posts

పేదల ముంగిట్లోకి ఉచితంగా కార్పొరేట్ వైద్యం

Satyam NEWS

కన్ఫ్యూజన్: ఆర్డినెన్సు ద్వారా ఏపి బడ్జెట్ ప్రతిపాదన?

Satyam NEWS

కేంద్రంలో రాష్ట్రంలో నిరంకుశ ప్రభుత్వాలు: రంగినేని

Satyam NEWS

Leave a Comment