38.2 C
Hyderabad
May 2, 2024 19: 20 PM
Slider నిజామాబాద్

గౌరమ్మకు అరుదైన గౌరవం బతుకమ్మ

#batukamma

తెలంగాణ ప్రజలు ఆడబిడ్డగా కీర్తించే గౌరమ్మకు అరుదైన గౌరవం బతకమ్మ పండగ తీసుకువచ్చిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో శనివారం మెప్మా, మున్సిపల్ సిబ్బంది, పి ఆర్ టి యు ఉపాధ్యాయునీల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ ప్రతిబింబంగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బతకమ్మ పండుకు తగిన గుర్తింపును ఇచ్చిందని పేర్కొన్నారు.

ఆడపడుచుల పండగ: మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి

బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల పండగ అని మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి అన్నారు. కామారెడ్డి మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ సంబరాలు వైభవంగా నిర్వహిస్తుందన్నారు. పండగను పురస్కరించుకుని బతుకమ్మ చీరలను అడపఫుచులకు కానుకగా అందిస్తుందని పేర్కొన్నారు. అనంతరం బతుకమ్మలను అందంగా పేర్చిన మహిళలకు కలెక్టర్, చైర్మన్ చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, డిఆర్డిఓ సాయన్న, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, పిఆర్టియు ప్రతినిధులు స్వప్న, సంతోష్ కుమార్, రాజు పాల్గొన్నారు.

Related posts

ఆఫ్ఘనిస్థాన్ గ్రాండ్ అసెంబ్లీలో 17 మందికి కరోనా

Satyam NEWS

గంజాయి సాగు లేదు….కానీ స‌ర‌ఫ‌రాకు యువ‌కుల‌ను వాడుకుంటున్నారు….!

Satyam NEWS

కొల్లాపూర్ చేరుకున్న రాజ్యాంగ పరిరక్షణ యుద్ధ భేరి ప్రచార యాత్ర

Satyam NEWS

Leave a Comment