33.7 C
Hyderabad
April 29, 2024 01: 04 AM
Slider ప్రత్యేకం

గంజాయి సాగు లేదు….కానీ స‌ర‌ఫ‌రాకు యువ‌కుల‌ను వాడుకుంటున్నారు….!

#vijayanagarampolice

ప‌రివ‌ర్త‌న కార్య‌క్ర‌మంలో తేల్చి చెప్పిన‌ పోలీస్ బాస్ లు

బాలీవుడ్ న‌టుడు షారూఖ్ ఖాన్ కొడుకు డ్ర‌గ్స్ కేసులో ప‌ట్టుబ‌డ‌టంతో…మ‌ళ్లీ ఒక్కసారి డ్ర‌గ్స్ య‌వ్వారం  వెలుగులోకి వ‌చ్చింది. దీనిపై కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాల డీజీపీల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి…అవ‌స‌ర‌మైతే నార్కోటిక్ డ్రగ్స్ ప్రివెన్షన్ ఏక్ట్  ను అమ‌లు చేయాల‌ని అదేశించింది. ఈ నేప‌ధ్యంలో ఏపీ రాష్ట్రంలోని ఆంధ్రా ఓడిషా బోర్డ‌ర్ లో  ఎక్కువ‌గా గంజాయి ర‌వాణా జ‌రుగుతున్న‌ట్టు పోలీసులు నివేదిక‌ల‌లో తేలింది.

ఈ క్ర‌మంలోనే విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ దీపిక‌..ఓఎస్డీ సూర్య‌చంద్ర‌రావు, ఎస్ఈబీ శ్రీదేవీరావులు ఇటీవ‌లే డీజీపీ నిర్వ‌హించిన  వీడియో కాన్ఫ‌రెన్స్ లో ఈ విష‌యాల‌పై చ‌ర్చించినట్టు స‌మాచారం. త‌ద‌నుగుణంగానే విజ‌య‌న‌గ‌రం జిల్లాలో గంజాయి సాగు అస్స‌లు లేద‌ని..కానీ ఆ గంజాయి స‌ర‌ఫ‌రాకు స్థానిక యువ‌కుల‌ను డ్రైవ‌ర్ల‌గా, కూలీలుగా వాడుకుంటున్నార‌ని…జిల్లా పోలీస్ బాస్ లు తేల్చారు. నార్కోటిక్ డ్రగ్స్ ప్రివెన్షన్ ఏక్ట్ ప్ర‌కారం..అలాగే డీజీపీ ఆదేశాల‌మేర‌కు గంజాయి కేసుల‌లో ప‌ట్టుబ‌డ్డ వారికి ప‌రివర్త‌న పేరుతో  జిల్లా పోలీస్ శాఖ ఓ వినూత్న  కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది.

ఈ సంద‌ర్బఃంగా విజ‌య‌న‌గరం డివిజ‌న్ ప‌రిదిలో విజ‌య‌న‌గ‌రం రూర‌ల్, జామి,కొత్త‌వ‌ల‌స‌, వ‌ల్లంపూడి, గంట్యాడ పీఎస్ ల‌లో గంజాయి స‌ర‌ఫ‌రా కేసుల్లో పట్టుబ‌డ్డ వారిని ప్ర‌త్యేకించి డీపీఓకు పలిపించించి డీఐజీ ఆదేశాల మేర‌కు ప‌రివ‌ర్త‌న కార్య‌క్ర‌మాన్ని నిర్విహించింది…జిల్లా పోలీస్ శాఖ‌.ఈ సంద‌ర్బఃంగా  జిల్లా ఎస్పీ దీపిక మాట్లాడుతూ గంజాయి స‌ర‌ఫ‌రా చేసిన ప‌క్షంలో నార్కోటిక్ డ్రగ్స్ ప్రివెన్షన్ ఏక్ట్ ప్ర‌కారం ఏకంగా జైలుశిక్షే ప‌డుతుంద‌న్నారు.ప‌ర్య‌వ‌స‌నంగా యువ‌కుల బంగారు భ‌విష్య‌త్ వాళ్ల క‌న్న‌వాళ్ల ఆశ‌లు అడియాశ‌లైపోతాయ‌న్నారు. ముఖ్యంగా యువ‌తీయువ‌కుల ఉజ్వ‌ల భ‌విష్య‌త్ ను దృష్టిలో పెట్టుకునే…గంజాయి స‌ర‌ప‌రా చేస్తున్న మీ అంద‌రికి ప‌రివ‌ర్త‌న పేరుతో కౌన్స‌లింగ్ ఇస్తున్నామ‌న్నారు. అంత‌కుమందు

ఓఎస్డీ,ఏఎస్పీ సూర్య‌చంద్ర‌రావు మామాట్లాడుతూ మీరు చేస్తున్న‌ది చాలా త‌ప్పు అని మీలో  మార్పు రావాల‌నే ఉద్దేశ్యంలో ఎస్పీ దీపికా  సూచ‌న‌లు,ఆదేశాల‌తో  ప‌రివ‌ర్త‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నామ‌న్నారు.వంద‌గ్రాముల గంజాయి కోసం…ఏకంగా జీవితాన్నే నాశ‌నం చేసుకోవ‌ద్ద‌ని చెప్ప‌డానికే ఈ ప‌రివ‌ర్త‌న నిర్వ‌హించామ‌న్నారు.అనంత‌రం స్పెష‌ల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అఫీస‌ర్ శ్రీదేవీ రావు మాట్లాడుతూ… జిల్లాలో గంజాయి సాగు ఎక్క‌డా లేద‌ని..కానీ  ఆ గంజాయి ని స‌ర‌ఫ‌రా చేస్తున్న వ్య‌క్తులు మాత్రం జిల్లాకు చెందిన వారే అధిక సంఖ్య‌లో ఉండ‌టం దారుణ‌మ‌న్నారు.  యుక్త వ‌య‌స్సులో గంజాయి ముసుగులో ఉజ్వ‌ల భ‌విష్య‌త్ ను నాశ‌నం చేసుకోవ‌ద్ద‌నే ఉద్దేశ్యంతో ఈ ప‌రివ‌ర్త‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నామ‌న్నారు.ఈ కార్య‌క్ర‌మంలో న‌గ‌ర డీఎస్పీ  అనిల్, ఎస్బీ సీఐలు శ్రీనివాస‌రావు, రాంబాబు,డీసీఆర్బీ సీఐ వెంక‌ట‌రావు, సీసీఎస్ సీఐ శ్రీనివాస‌రావు,టూటౌన్ సీఐ ల‌క్ష్మ‌ణ‌రావులు పాల్గొన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు కృషి చేస్తా

Satyam NEWS

జడ్పీ మీటింగ్.. 5 నిమిషాలు: 2024-25 బడ్జెట్ ఆమోదం

Satyam NEWS

భార్తను హత్య చేసిన భర్త

Bhavani

Leave a Comment