35.2 C
Hyderabad
April 27, 2024 11: 05 AM
Slider ప్రపంచం

ఆఫ్ఘనిస్థాన్ గ్రాండ్ అసెంబ్లీలో 17 మందికి కరోనా

#Afghanistan

శాంతి ప్రక్రియకు ప్రధాన అడ్డంకిగా మారిన తాలిబాన్ ఖైదీల విడుదల అంశంపై చర్చించేందుకు సమావేశమైన ఆఫ్ఘనిస్థాన్ గ్రాండ్ అసెంబ్లీలో 17 మంది ప్రముఖులకు కరోనా పాజిటీవ్ వచ్చింది. మొత్తం 3,620 మంది ప్రముఖులు ఈ గ్రాండ్ అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యారు.

దేశ భద్రతకు సంబంధించిన తాలిబాన్ ఖైదీలను విడిచి పెట్టాలా వద్దా అనే అంశంపై ఈ అసెంబ్లీ సమావేశం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆదివారం కూడా ఈ సమావేశం జరుగుతుంది. సమావేశంలో పాల్గొన్న అత్యంత ప్రముఖ వ్యక్తులకు కరోనా టెస్టులు నిర్వహించారు.

ఆ టెస్టులలో 17 మందికి పాజిటీవ్ వచ్చింది. వెంటనే వారిని సమావేశం నుంచి బయటకు పంపి అక్కడ నుంచి కాబూల్ లోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వారిని క్వారంటైన్ లో ఉంచుతారు. తాలిబాన్లతో శాంతి ఒప్పందంలో భాగంగా అమెరికా తన సేనలు ఉపసంహరించుకునేందుకు నిర్ణయించింది.

ఈ మేరకు జరిగిన ఒప్పందంలో తాలిబాన్లు కొన్ని షరతులు విధించారు. అందులో ప్రధానమైనది తాలిబాన్ ఖైదీల విడుదల. ఇదే అంశంపై ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అందుకే ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న సమావేశాన్ని కూడా కరోనా వదల్లేదు.

Related posts

కొండగట్టుకు రూ.100 కోట్లు ఇచ్చిన కేసీఆర్ కు కృతజ్ఞతలు

Bhavani

కేసీఆర్ పై పోరాడేందుకే బిజెపిలో చేరుతున్నా

Satyam NEWS

సీఎం పర్యటనకు జల్లెడపడుతున్న పోలీసులు

Satyam NEWS

Leave a Comment