27.7 C
Hyderabad
April 30, 2024 09: 18 AM
Slider ప్రత్యేకం

కొల్లాపూర్ చేరుకున్న రాజ్యాంగ పరిరక్షణ యుద్ధ భేరి ప్రచార యాత్ర

#mrps

రాజ్యాంగ పరిరక్షణ యుద్ధ భేరి విద్యార్థి ప్రచార యాత్ర నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కు చేరుకుంది. ఎంఆర్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ నేతృత్వంలోని రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఏప్రిల్ 9న హైదరాబాద్ లో రాజ్యాంగ పరిరక్షణ యుద్ధ భేరి జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సన్నాహక కార్యక్రమాలు జరుగుతున్నాయి.

కొల్లాపూర్  నియోజకవర్గంలోని  మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్(MSF) కొల్లాపూర్ అసెంబ్లీ ఇంచార్జ్ తోలు రాము మాదిగ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం సందర్భంగా డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి ముందుగా నివాళులు అర్పించారు. అనంతరం కార్యక్రమ ముఖ్య అతిథి, దక్షిణ తెలంగాణ విద్యార్థి యాత్ర ఇంచార్జి చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ మాట్లాడుతూ రాజ్యాంగ వ్యతిరేకి అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వారికి బుద్ధి చెప్పేలాగా భారీ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు.

రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామని, దీనితో KCRకు రాజకీయ సమాధి తప్పదని ఆయన అన్నారు. భారత రాజ్యాంగానికి KCR రూపం లో వచ్చిన ప్రమాదాన్ని ఎదుర్కునే పనిని విద్యార్థులు తమ కర్తవ్యాన్ని భావించి ఉద్యమించాలని ఆయన కోరారు.

SC, ST, BC, మైనారిటీ విద్యార్థుల త్యాగాల పునాదుల మీద, డా.బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం లోని ఆర్టికల్ 3 ద్వారా వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన KCR దళితుల, గిరిజనుల, వెనుకబడ్డ కులాల, మైనారిటీ, మహిళల హక్కులను అణగదొక్కడ శోచనీయమని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలని KCR అనడం అంటే తెలంగాణాలోని దళిత బహుజనుల అభివృద్ధి కి KCR వ్యతిరేకమని స్పష్టంగా అర్ధమవుతుందని వారు తెలిపారు.

ఇలాంటి మహాజన వ్యతిరేకి కి రాజకీయ బుద్ది చెప్పాల్సిన బాధ్యత చదువుకున్న ప్రతి విద్యార్థి పై ఉందని అన్నారు. యుద్ధబేరి మహాసభకు లక్షలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మామిడి కర్ణాకర్ మాదిగ, పవన్ కుమార్, మొలకలపల్లి పరుషారాము, ఎర్రముని యాదగిరి, ఆరకల రమేష్, కార్తీక్, ప్రవీణ్, అంజి, MRPS నాయకులు పుట్టపాగ రాము విద్యార్థిని, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

శభాష్ ఖాకీ : 24 గంటలలో నిందితుడ్ని పట్టుకున్న పోలీస్…..!

Satyam NEWS

టీడీపీపొలిట్ బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాస రెడ్డి ని అరెస్టు చేసిన పోలీసులు…

Bhavani

నిజాలు నిర్భయంగా రాస్తున్న జర్నలిస్టులకు బెదిరింపులు

Satyam NEWS

Leave a Comment