37.2 C
Hyderabad
April 30, 2024 12: 38 PM
Slider ప్రకాశం

బీసీ కుల గణన కు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలి

#ongole

కేంద్ర ప్రభుత్వం 2020-21 చేపట్టబోతున్న జనగణనలో ఓ బి సి (బీసీ)కులాల వారిగా కూడా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను చైతన్య పరుస్తూ నిరసనలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్న బహుజన ప్రజా చైతన్య వేదిక ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు లో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బహుజనప్రజా చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ ఈ దేశంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలను 1931 తర్వాత ఇంత వరకూ లెక్కించలేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కమిషన్లు నియమించినా వాటి రిపోర్టులు అమలుకు నోచుకోవడం లేదని, అందువలన బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఎంతో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ దేశంలో క్రూర మృగాలను, వివిధ రకాల జంతువులను, గొర్రెలను, పక్షులను, బర్రెలను, మేకలను లెక్కిస్తున్న ప్రభుత్వాలు ఈ దేశానికి తమ వృత్తుల ద్వారా సంపదను సృష్టిస్తున్న బీసీల లెక్కలను లెక్కించకపోవడం అత్యంత దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. 2011లో జనాగణంలో ఓబీసీ జనాభా లెక్కలు సేకరించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత వరకు ఆ లెక్కలను బయట పెట్టలేదు.

బీసీ కులాల వారిగా కూడా లెక్కించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్పుడు బీజేపీ డిమాండ్ చేసింది..ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓబీసీ వర్గీకరణ చేస్తామని జస్టిస్ రోహిణి కమిషన్ నియమించింది..ఈ రోహిణి కమిషన్ చిత్తశుద్ధితో  ఓబీసీ(బిసి) వర్గీకరణ చేయాలనంటే బీసీ కులాల వారిగా లెక్కలు తప్పనిసరిగా అవసరముంది, అందువలన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సంప్రదించి బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం..

అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ లు బ్యాక్ వార్డ్ క్లాసెస్ కాదు బ్యాక్ బోన్ క్లాసెస్ అని చెప్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బిసి జనగణన పట్ల తమ వైఖరి స్పష్టం చేస్తూ..ఒడిశా, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో కూడా “బీసీ కులగణన” చేపడతామని బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని దొంతా సురేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు నాదెండ్ల వీరరాఘవయ్య, శాలివాహన సంఘం జిల్లా అధ్యక్షుడు రాజవరపు చిన్నసుబ్బయ్య, రజక సంఘం నాయకులు ఎల్లయ్య, ఎంబిసి అధ్యక్షురాలు ఆవుల ఉమా, మొండిబండ సంఘం నాయకురాలు అనూష, బీసీవి నాయకులు పాశం కృష్ణ, షేక్ ఖాదర్ బాబా, రాజా తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆదాయపు పన్ను ఎగవేతపై ఆరా

Bhavani

అంబేడ్కర్ విగ్రహాన్ని తరలించాలనే కుట్రను విరమించుకోవాలి

Satyam NEWS

పోలింగ్ ముగిసింది… కొత్త ఆట మొదలు కాబోతున్నది…

Satyam NEWS

Leave a Comment