38.2 C
Hyderabad
April 29, 2024 12: 44 PM
Slider హైదరాబాద్

డిమాండ్లు నెరవేర్చిన వారికే ఓటు: బీసీ ఫెడరేషన్

#bcfedaration

హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి ఆధ్వర్యంలో మునుగోడు – మనగోడు అనే విషయంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సభా అధ్యక్షులుగా బెల్లాపు దుర్గారావు (రాష్ట్ర అధ్యక్షులు) వ్యవహరించారు. ఈ సమావేశంలో మునుగోడులో అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీసీ కులాల యొక్క సంక్షేమ డిమాండ్స్ సాధించేందుకు ఆయా పార్టీల ప్రధాన నాయకులతో చర్చించాలని సమితి సభ్యులు బీసీ కులాల నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

మునుగోడులో బీసీ కులాలతో మనగోడును వినిపించుటకు పెద్ద ఎత్తున బీసీలను చైతన్యం చేయుటకు నిర్ణయించినట్లు తెలిపారు. గత 8 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 11 కులాల ఫెడరేషన్ లు, కార్పోరేషన్ లకు బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వక పోవడం, కాగితాలకే జీఓలు పరిమితమయ్యాయి అని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాకు కావల్సిన సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయంపై పార్టీలు వారి మ్యాని ఫెస్టోలో బీసీ కులాలకు ఎలాంటి సంక్షేమం, బడ్జెట్, బీసీ బంధు, మొదలైనవి సంబంధించినవి మ్యాని ఫెస్టోలో క్లుప్తంగా వివరించిన పార్టీలకే మద్దతు ప్రకటిస్తామని తెలంగాణ బిసి ఫెడరేషన్ కులాల సమితి రౌండ్ టేబుల్ సమావేశంలో సభ్యులు అందరూ ఏక గ్రీవంగా చర్చించి తీర్మానించడమైనదని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బెల్లాపు దుర్గరావు ( అధ్యక్షులు), కీర్తి యుగేందర్ (ప్రధాన కార్యదర్శి), తోవిట సదానంద చారి (సలహాదారులు), భాస్కరుడు (మీడియా కన్వీనర్), మంగిలిపెళ్లి శంకర్, నర్సింగ్ రావు, దీపక్ (గంగపుత్ర), కందూరు వెంకట్ రాముడు (మేదరి), షేక్ భాషా, అహ్మద్ హుస్సేన్ (దూదేకుల), కిరణ్ కుమార్, అరుణ, జ్యోతి (విశ్వ బ్రాహ్మణ), శారదా గౌడ్, సంఘ వీరప్ప, శివ రాం (మేరు), చేర్యాల రాకేష్, శ్రీకాంత్, రేణుక, దుర్గా ప్రసాద్, యశ్వంత్, (నాయి బ్రహ్మణ), హనుమంత్, రామకృష్ణ, నాగరాజు (మేదరి), బాబా ఫకృద్దిన్, కాలేరు నరేష్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

వ్యవసాయ కార్పొరేషన్లు సాంకేతికను అందిపుచ్చుకోవాలి

Satyam NEWS

పాత్రుని వలసలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం

Satyam NEWS

75లక్షల నగదు పట్టివేత

Sub Editor 2

Leave a Comment