38.2 C
Hyderabad
May 1, 2024 20: 18 PM
Slider క్రీడలు

వన్డే కెప్టెన్సీ నియామకంపై బీసీసీఐ దృష్టి..

భారత జట్టు టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ నియామకం నేపథ్యంలో బీసీసీఐ వన్డే కెప్టెన్సీపై విరాట్ కోహ్లీతో మాట్లాడనున్నట్లు సమాచారం. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలని బోర్డు భావిస్తుందని, తద్వారా అతను తన బ్యాటింగ్‌పై దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుందని బీసీసీ వర్గాలు తెలిపాయి.

దక్షిణాఫ్రికాతో జనవరి 11, 2022 నుంచి ప్రారంభమయ్యే ద్వైపాక్షిక సిరీస్‌లో టీమ్ ఇండియా వన్డే కెప్టెన్సీలో మార్పులు జరగవచ్చని తెలుస్తోంది. రోహిత్ శర్మ 50 ఓవర్ల ఫార్మాట్‌లో కూడా కేఎల్‌తో బాధ్యతలు చేపట్టాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.  2017 జనవరిలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కెప్టెన్సీ నుండి తప్పుకోవడంతో కోహ్లీ పరిమిత ఓవర్ల జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. కోహ్లీ 95 వన్డేల్లో భారతదేశానికి నాయకత్వం వహించాడు. 65 విజయాలు, 27 ఓటములతో 70 శాతం గెలుపు రేటును అందించాడు.

Related posts

త్వరలో హీరోయిన్ గా మంత్రి రోజా కుమార్తె అన్షు

Satyam NEWS

వ్యాక్సినేషన్ ఇంత స్లోగా జరిగితే మూడో వేవ్ గ్యారెంటీ

Satyam NEWS

రాజకీయ జోక్యం ఎక్కువైతే పంచాయితీలు ఇంతే సంగతులు….

Satyam NEWS

Leave a Comment