32.2 C
Hyderabad
May 1, 2024 23: 15 PM
Slider నల్గొండ

న‌కిరేక‌ల్ పట్టణ సుంద‌రీక‌ర‌ణ చేయడమే లక్ష్యం

Nakerekal

నకిరేకల్ పట్టణం 18వ వార్డు ఎస్ ఎల్ బి సి కాలనీలో ఎస్ డి ఎఫ్ నిధులతో రూ. 10 లక్షలతో నిర్మించనున్నసిసి రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులకు, రూ. 10 లక్షలతో నిర్మించనున్నసులబ్ కాంప్లెక్స్ నిర్మాణానికి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిరేకల్ పట్టణంలో ఎస్ ఎల్ బి సి కాలనీలో ప్రధానంగా రోడ్లు గతంలో వర్షం వచ్చినప్పుడు డ్రైనేజీ వాటర్ వర్షం నీరు స్తంభించిపోయి నీరు నిల్వ ఉండి కాలనీ వాసులు ఇబ్బంది పడ్డారని, రాకపోకలకు ఇబ్బంది పడడం చూసి ఈ ప్రాంత సమస్యల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి సహకారంతో నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు.

నియోజకవర్గ కేంద్రమైన నకిరేకల్ పట్టణానికి శాలిగౌరారం, తిప్పర్తి, కట్టంగూర్, కేతపల్లి, మండలాల ప్రజలు వ్యాపారరీత్యా, హాస్పిటల్, కాలేజీ, స్కూల్ పిల్లలు నియోజకవర్గ కేంద్రానికి వ‌స్తున్నార‌ని, ప్రధానంగా మహిళలు టాయిలెట్ కి వెళ్లడానికి ఇబ్బంది పడడంతో ప్రతి టౌన్ లో సులబ్ కాంప్లెక్స్ ఉండాలని సంక‌ల్పించి శంకుస్థాపన చేశామ‌న్నారు. మంత్రి కేటిఆర్, జగదీష్ రెడ్డి సహకారంతో నిధులు సమీకరించి పట్టణంలో సిసి రోడ్లు, డ్రైనేజీ వీధి దీపాల ఏర్పాటున‌కు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Related posts

శ్రీవారిని దర్శించుకున్న అక్కినేని నాగార్జున దంపతులు

Satyam NEWS

కేటీఆర్ పర్యటనలో అంగన్వాడీలను బానిసలా నిలబెట్టారు

Satyam NEWS

పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డు దారులకు బియ్యం ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment