నేషనల్ కన్జుమర్ రైట్స్ కమీషన్ తెలంగాణా రాష్ట్ర వైస్ చైర్మన్, సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ విజిలెన్స్ మానిటరింగ్ మెంబర్ డాక్టర్ అనితా రెడ్డి రాష్ట్ర బెస్ట్ లీడర్ అవార్డును, వరంగల్ రోటరీ కమ్యూనిటీ హాలు నందు నిర్వహించిన జాతీయ వియోగదాల దినోత్సవ వేడుకలలో అందుకున్నారు. జిల్లా మెట్రాలజీ శాఖ సహాయక కమీషనర్ రాజేశ్వర్, ది. ఎన్సీఆర్సి ఫౌండర్ చైర్మన్ డాక్టర్ సాయి రమేష్, డాక్టర్ రామానుజ స్వామి తదితర అతిధుల చేతుల మీదుగా డాక్టర్ అనితా రెడ్డి అవార్డును అందుకున్నారు. వినియోగదారులు రక్షణ చట్టం పై వందల సంఖ్య లో గ్రామ స్తాయినుండి నగర స్తాయి వరకు అవగాహన సదస్సులు, సేవా కార్యక్రమాలు నిర్వహించి నందుకు ఈ అవార్డును అందించామని తెలిపారు. ఈ సందర్భంగా అతిధులు మాట్లాడుతూ డాక్టర్ అనితా రెడ్డి సమాజానికి అందిస్తున్న సేవలు అందరికీ స్పూర్తి దాయకంగా ఉన్నాయని జిల్లా తునికలు కొలతల శాఖ సహాయ కమీషనర్ రాజేశ్వర్, మెట్రాలజీ శాఖ ఇన్ స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ది. ఎన్సీ. ఆర్సి వ్యవస్థా పక చైర్మన్ డాక్టర్ సాయి రమేష్, అడ్మిన్ చైర్మన్ డాక్టర్ రామానుజ స్వామి అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందని కానీ అవార్డు మరింత భాద్యత పెంచిందని, ఇకముందు మరింత విస్తారంగా అవగాహన సదస్సులు, అవసరార్దులకు సేవా కార్యక్రమాలు చేపడుతానని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు జిల్లా చైర్మన్ సాంబమూర్తి, సెక్రటరీ రాంరెడ్డి,సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
previous post