38.2 C
Hyderabad
April 28, 2024 22: 45 PM
Slider కడప

సామాజిక మాధ్యమాల్లో మనీ రిక్వెస్టులకు…స్పందించవద్దు..

#kadapa

సామాజిక మాధ్యమాల్లో జిల్లా కలెక్టర్ వారి పేరుతో.. ఫేక్ అకౌంట్ల ద్వారా డబ్బులు అడుగుతున్నట్లు.. తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి తప్పుడు మెసేజీలకు ఎవరూ స్పందించవద్దని కడప జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ఒక ప్రకటన ద్వారా అధికారులకు,  ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల కోవిడ్ మృతుల కుటుంబాలకు కొందరు ఫోన్లు చేసి..  బ్యాంకు అకౌంట్, పాన్ తదితర వివరాలు అడుగుతూ.. కొంత అమౌంట్ ఖాతాల్లో నిల్వ ఉండాలని, మృతులకు సంబంధించి పరిహారం జమ చేస్తామని సైబర్ నేరాలకు పాల్పడిన సంఘటనలు  తమ దృష్టికి వచ్చిందన్నారు.

తాజాగా.. తన పేరుతో  డిపి ఉంచుకుని ఇన్ స్టాగ్రామ్ ఫేక్ అకౌంట్ ద్వారా.. డబ్బులు అడుగుతున్నట్లు కూడా తమ దృష్టికి వచ్చిందని.. ఇలాంటి ఫేక్ అకౌంట్ల రిక్వెస్టులకు ఎవరూ కూడా స్పందించ వద్దని జిల్లా కలెక్టర్  అధికారులకు, ప్రజలను విజ్ఞప్తిe చేసారు. సామాజిక మాధ్యమాల్లో  ఇలాంటి మెసేజీలు ఎవరికైనా వస్తే.. తనకు గాని లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కానీ తెలియజేయాలని ఆయన తెలిపారు. సైబర్ నేరాలపై జిల్లా సైబర్ పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఉంచిందని.. నేరాలకు పాల్పడే వారిపై.. కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

Related posts

కౌంటర్ ఎటాక్: బుద్ధి లేకుండా మాట్లాడుతున్న పృధ్వీ

Satyam NEWS

మానవాళికి మరో ముప్పు.. మళ్ళీ బ్లాక్ డెత్ ప్లేగు వ్యాధి..

Sub Editor

స్థానికుల‌చే మొక్కలు నాటించిన విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment