40.2 C
Hyderabad
May 2, 2024 15: 41 PM
Slider మహబూబ్ నగర్

పీఆర్ ప్రాజెక్ట్ పనులకు కావలసిన భూసేకరణను వేగవంతం చేయాలి

#nagarkurnoolcollector

రెవెన్యూ అధికారులను ఆదేశించిన   జిల్లా కలెక్టర్ మను చౌదరి

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కొనసాగుతున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు ఆటంకం కలుగకుండా తుదిదశ చేరిన భూసేకరణను వెంటనే పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్‌ మను చౌదరి ఆదేశించారు.

సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయ తన చాంబర్‌లో పాలమూరు-రంగారెడ్డి నీటిపారుదల, రెవిన్యూ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణకు సంబంధించిన కుడికిళ్ల, తీగలపల్లి, నార్లపూర్, జొన్నలబొగుడ, కల్వకోల్‌, కుమ్మెర, పోతిరెడ్డిపల్లి, కారుకొండ బొందలపల్లి, వట్టెం తదితర గ్రామాల్లో కావాల్సిన  భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ప్రాజెక్టు పనులు కావాల్సిన భూ సేకరణను వీలైనంత వేగంగా  ఎలాంటి అవరోధాలు లేకుండా చూడాలన్నారు. 

నాగర్ కర్నూల్ జిల్లాలో 12వ ప్యాకేజీల్లో కొనసాగుతున్న ప్రాజెక్టుకు 11,776 ఎకరాల భూసేకరణ అవసరం ఉండగా ఇప్పటివరకు 10,357 ఎకరాల భూమిని భూ సేకరణ పూర్తిచేసి ప్రాజెక్టు నిర్మాణ పనులకు అప్పగించడం జరిగిందన్నారు.1000 ఎకరాలకు సంబంధించిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నష్టపరిహారం చెల్లించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

మిగిలిన 418 ఎకరాల భూ సేకరణను రైతులతో చర్చించి సాధ్యమైనంత త్వరగా భూసేకరణను పూర్తి చేసి ప్రాజెక్టు పనులకు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను రెవెన్యూ ఇరిగేషన్ ఆదేశించారు.

భూ సేకరణ తో పాటు రైతులకు నష్టపరిహారం ఆర్ అండ్ ఆర్ పనుల పురోగతి ప్రభుత్వం నుండి అందవలసిన నిధులపై నీటిపారుదల అధికారులతో కలెక్టర్  చర్చించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్ రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఇంజనీరింగ్‌ అధికారులు మురళి, పార్థసారథి, సంజీవ్ రావు, శ్రీధర్, చందు నాయక్, నాగర్ కర్నూలు ఆర్డీవో నాగలక్ష్మి ఎత్తిపోతల ఇంజనీరింగ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Related posts

నిత్యావసరాలు అందించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే

Satyam NEWS

ములుగు ఎస్పీని కలిసిన పల్లా బుచ్చయ్య

Satyam NEWS

ఏప్రిల్ 4 న ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 మెయిన్స్‌ పరీక్ష

Murali Krishna

Leave a Comment