33.2 C
Hyderabad
May 15, 2024 14: 32 PM
Slider హైదరాబాద్

సిబ్బందికి జీతం ఎగ్గొట్టిన భారత్ టు డే ఛానల్

ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్న జనం ఇన్ఫోటైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ట్రూ మల్టీమీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు సహా బీజేపీ నాయకుడు ధరం గురవారెడ్డిపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదయ్యింది.

రాజకీయాల్లో బీజేపీ నాయకుడిగా, సమాజంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా చెలామణి అవుతూ మీడియా రంగంలో రాణించాలని భారత్ టుడే ఛానల్ నిర్వహణ బాధ్యతలను తీసుకున్న తర్వాత ఉద్యోగులకు చుక్కలు చూపించాడు.

మార్చి 2022నుంచి భారత్ టుడే ఛానల్ నిర్వహణ బాధ్యతలను తీసుకున్నాడు. కాకినాడ శ్రీపీఠంకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక నిపుణులు, ధార్మిక ప్రవచన నిష్ణాతులైన స్వామి పరిపూర్ణానంద నుంచి ధరం గురవారెడ్డి ఛానల్ నిర్వహణ బాధ్యతలను తీసుకున్నాడు. రోజుకు 23గంటల ఎయిర్ టైమ్ స్లాట్ తీసుకుని టీవీ ప్రసారాలను కొనసాగించే విధంగా ఏడేళ్ల వ్యవధితో ఒప్పందం చేసుకున్నాడు. సహస్ర మీడియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహణ బాధ్యతలను స్వీకరించిన గురవారెడ్డి అండ్ టీమ్ జనం ఇన్ఫోటైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ట్రూ మల్టీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఆధ్వర్యంలో నిర్వహించే విధంగా కార్యకలాపాలు కొనసాగించారు. మార్చి నెల గడిచిన తర్వాత, ఏప్రిల్ నెలలో వేతనాలు ఇవ్వాల్సి ఉండగా కాస్తా జాప్యం జరిగింది. జీతాలకోసం ఉద్యోగులకు ఇబ్బందులు మొదలయ్యాయి.

ఏప్రిల్ నెల గడిచిందిచింది. రెండు నెలల జీతం ఒకేసారి ఇస్తారని భావించిన ఉద్యోగులు సంస్థ నిర్వాకంతో ఖంగుతిన్నారు. రెండు నెలల జీతం రావాల్సిన సందర్భంలో ఖర్చులకు రూ.5వేల(అక్షరాలు ఐదువేల రూపాయల)చొప్పున గూగుల్ పే, ఫోన్ పే ద్వారా చెల్లింపులు జరిగాయి.

అక్కడి నుంచి ఉద్యోగులకు సక్రమంగా జీతాలివ్వకుండా ఇబ్బందులు పెట్టడం మొదలైంది. మేనెల గడిచింది. జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబరులోనూ ఇదేపరిస్థితి. ఎవరికి ఏరోజు డబ్బు లిస్తారో తెలియదు. జీతం ఎపుడొస్తుందోనని ఉద్యోగులు ఎదురు చూడాల్సిన పరిస్థితి.

భారత్ టుడే ఛానల్ నిర్వహణ బాధ్యతలు తీసుకున్న జనం ఇన్ఫో టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ట్రూ మల్టీమీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నాయి. రాజకీయ నాయకులనుంచి, వివిధ సంస్థలు నుంచి ప్రకటనలు, కార్యక్రమ ప్రసరాలకోసం వసూలు చేసిన నగదును అక్రమ మార్గాల్లో వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ ఎగ్గొట్టే విధానాలను అనుసరిస్తున్నారు.

పనిచేసే ఉద్యోగులకు నెలవారీ వేతనాలను చెల్లించకుండా ఇబ్బంది పెట్టడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పొరుగు ప్రాంతాలకు చెందిన వారు హాస్టళ్లకు ఫీజు చెల్లించలేక కష్టాలు ఎదుర్కొన్నారు. ఇళ్లకు అద్దెలు చెల్లించుకోలేక, పిల్లలకు ఫీజులు చెల్లించుకోలేక ఇబ్బందులు పడ్డారు. మరికొంతమంది జీతం డబ్బులు వస్తాయనే నమ్మకంతో అవస్థలు పడ్డారు. ఆస్పత్రుల్లో చేరి చికిత్సకోసం ఖర్చు లకు డబ్బు ల్లేకుండా ఇబ్బందిపడిన ఉద్యోగులున్నారు.

వినాయక్ చవితి పండుగకు ముందుగా అందరూ జీతం వస్తుందని ఎదురుచూశారు. నిరాశే ఎదురైంది. భారత్ టుడే ఛానల్ నిర్వహణ బాధ్యతలను చూసే ధరం గురవారెడ్డి ఉద్యోగులను సమావేశపరిచి జీతం రెండురోజుల్లో ఇస్తానని చెప్పి వాయిదాలు వేయడంతో విశ్వాసంకోల్పోయారు.

జీతాలిస్తేనే పోనీ చేస్తామని ఉద్యోగులు నిరవధిక సమ్మెకు పూనుకున్నారు. దీంతో రోజువారి టీవీ ప్రసారాలు వినాయక చవితి పండుగ ముందునుంచే ఆగిపోయాయి. టీవీ ఛానల్ కార్యాలయం నిర్వహిస్తున్న భవనానికీ అద్దె చెల్లింపులు, విద్యుత్తు ఛార్జీల చెల్లింపుల్లోనూ తీవ్రజాప్యంతో పవర్ కట్ చేశారు.

వినాయకచవితి పండుగ తర్వాత సెప్టెంబర్ 11న రాత్రి ఉద్యోగులకు జీతాల చెల్లింపులు చేస్తున్నామని సమాచారం ఇచ్చారు. కంపెనీ హెచ్ ఆర్ మేనేజర్ కూరెళ్ల నాగేందర్ అక్టోబరు 11తేదీన చెల్లుబాటయ్యే విధంగా పోస్ట్ డేటెడ్ చెక్కులతో జీతాలు పంపంణీచేశారు. రెండు రోజుల తర్వాత నలుగురికి అక్టోబర్ 18తేదీ, మరికొంతమందికి అక్టోబరు 31తేదీతో చెక్కులిచ్చి చేతులు దులుపుకున్నారు. మరికొంతమందికి చెక్కులు అయిపోయాయని మొండిచేయి చూపారు.

చెక్కులిచ్చిన తర్వాత ధరం గురవారెడ్డి, హెచ్ ఆర్ మేనేజర్ నాగేందర్ పత్తాలేకుండా పోయారు. అక్టోబరు 11 తేదీ, అక్టోబరు 18తేదీ చెక్కులు తీసుకుని బ్యాంకులకు వెళ్లి ఉద్యోగులు నిర్ఘాంతపోయారు.ఖాతాదారులు చెక్ పేమెంట్ నిలుపుదల చేయమని అభ్యర్థించారని, ఏచెక్కూ చెల్లుబాటు కాలేదు. దీంతో ఉద్యోగులందరూ సమావేశమై మోసగాళ్లపై కేసు పెట్టాలని సామూహికంగా నిర్ణయం తీసుకున్నారు.

జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన ఉద్యోగులు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు మేనేజింగ్ డైరెక్టర్ దరం గురవారెడ్డి, కంపెనీ డైరెక్టర్లు దరం రాధిక, కుప్పిరెడ్డి సింధూర, కూరెళ్ల శోభారాణిపై చీటింగ్ కేసు నమోదు చేశారు.

Related posts

శాస్త్రవేత్తలు మేలురకమైన వంగడాలను రూపొందించాలి

Satyam NEWS

ఫ్రీ వైరస్:బెంగాల్ లో పేదలకు ఉచిత విద్యుత్

Satyam NEWS

మద్యపాన నిషేధం దిశగా మరో అడుగు ముందుకు వేసిన ఏపి

Satyam NEWS

Leave a Comment