27.7 C
Hyderabad
May 15, 2024 05: 42 AM
Slider కడప

వైకాపా తొత్తులకే నా వ్యాఖ్యలు వర్తిస్తాయి: బత్యాల

#bhatyala

మంగళగిరి తెదేపా కేంద్ర కార్యాలయంలో నిన్న జరిగిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,రాజంపేట నియోజకవర్గ ఇంచార్జీ బత్యాల చంగల్ రాయుడు  చేసిన వ్యాఖ్యలను తప్పుడుగా ప్రచారం చేస్తున్న వైకాపా వారికి భత్యాల  ఆదివారం నాడు ప్రెస్ నోట్ విడుదల చేశారు. తాను చేసిన వ్యాఖ్యలు చట్టాన్ని గౌరవిస్తూ పనిచేసే పోలీసులకు వర్తించవని, వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న వారికే వర్తిస్తాయని, నేను కూడా ఒక సీనియర్ న్యాయవాదినేనని తనకు పోలీసు, కోర్టు, చట్టం సమాజం పట్ల ఎంతో నమ్మకం గౌరవం ఉందని వివరణ ఇచ్చారు.

వైకాపా నేతల ప్రోద్బలంతో, వారి మెప్పు కోసం తెదేపా నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తూ, తప్పు చేసిన వారిని కాపాడే ప్రయత్నం చేసిన వారికే వర్తిస్తాయని తెలిపారు. తప్పుడు కేసులు పెట్టడమే పెద్ద నేరం,చట్టాన్ని గౌరవించే పోలీసులు ఎవరు ఈ పని ఎవరూ చేయరు. చట్ట బద్ధంగా, నిజాయతీగా పని చేసే పోలీసులను, ఇతర అధికారులను నేను ఎప్పుడూ గౌరవిస్తానని సృష్టం చేశారు. పోలీసులు తప్పుడు కేసులు బనాయించి,ఇబ్బందు లకు గురవుతున్న తెదేపా నాయకులు, కార్యకర్తలు పై పోలీసుల వారు చేసిన వేధింపులను, మీకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా గౌరవ మెజిస్ట్రేట్ వారికి తెలియజేసినట్లయితే, సదరు పోలీసులపై మెజిస్ట్రేట్ వారు చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకొని మీకు న్యాయం చేస్తారని సమావేశం ముఖంగా తెలిపారు.

ఈ వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి రైతుల మొదలుకొని ఉపాధ్యాయులను, ఉద్యోగ సంఘాలను, కార్మిక సంఘాలను, ఇతర పార్టీల నేతలను, నేతల కుటుంబ సభ్యులపై జరిగిన దాడులను, దుర్మార్గాలను, దౌర్జన్యాలను, అక్రమ అరెస్టులు, వేధింపుల నుండి కాపాడుతున్నది దేవస్థానంలో దేవుడు వలె న్యాయస్థానంలోని న్యాయమూర్తులేనని తెలిపారు.

పోలీసు వ్యవస్థపై,న్యాయస్థానాలపై నాకు ఎనలేని గౌరవం ఉందని,కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర పోలీసులు వైకాపా తొత్తులుగా వ్యవహరిస్తూ తెలుగుదేశ పార్టీ కార్యకర్తలను నాన హింసలు పెడుతూ ఇబ్బందులకు గురిచేయడం బాధ కలిగించిందనే నా నోట ఆ మాట వచ్చినందుకు నేను విచారిస్తున్నానన్నారు. పోలీసు వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలను బ్రష్టుపట్టిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, వైసిపి ఎమ్మెల్యే మరియు వైకాపా నాయకులు ఇప్పటికైనా తెలుసుకుని వ్యవస్థలను సరిదిద్దే విధంగా ప్రయత్నం చేయండి అని సలహాఇచ్చారు. వైసీపీ వారి మాయ మాటలను రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఎవరూ నమ్మి మోసపోవద్దని,వైసీపీ ప్రభుత్వానికి అన్ని శాఖల ఉద్యోగులపైన ఏమాత్రం శ్రద్ధ, ప్రేమ ఉందో రాష్ట్రంలో అందరికీ తెలుసని అన్నారు.

ప్రస్తుత రాజంపేట శాసనసభ్యుడు, అతని సోదరులు, బంధువులు మరియు అతని అనుచరులు ఏ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రశ్నించిన అధికారు లను,అవినీతికి అడ్డు తగిలి నిజాయితీగా నిలబడినటువంటి అధికారులను రాయలేని విధంగా చెప్పలేని విధంగా అసభ్యకరమైన పదజాలంతో దూషించారో, బెదిరించారో నియోజకవర్గ ప్రజలకు కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసని పేర్కొన్నారు. వీరి వేధింపులు తాళలేక రాష్ట్రం విడిచి పక్క రాష్ట్రాల్లో ఉన్నా సినీ పక్కిలో వారి మీద దాడి చేయడం రాష్ట్రం లో అందరికీ తెలుసని అన్నారు.

Related posts

Sad info: కరోనాకు తలవంచిన సీనియర్ వైద్యుడు

Satyam NEWS

కేరళలో కోవిడ్ నుంచి తేరుకున్న ఇద్దరు వృద్ధులు

Satyam NEWS

ములుగులో ఇంటింటికి కాంగ్రెస్ గ్యారెంటీలు

Satyam NEWS

Leave a Comment