40.2 C
Hyderabad
April 29, 2024 15: 29 PM
Slider ఆధ్యాత్మికం

నందలూరు శ్రీ సౌమ్యనాధ స్వామి ఆలయం టీటీడీ స్వాధీనం

#swomyanathatemple

సత్యంన్యూస్.నెట్ చెప్పినట్లే జరిగింది

అన్నమయ్య జిల్లా నందలూరు లోని ప్రసిద్ధ శ్రీ సౌమ్యనాధ స్వామి ఆలయం టిటిడిలో విలీన ప్రక్రియ ఆదివారం జరిగింది.ఆలయ పూజారులు టీటీడీ,ఎండోమెంట్ సిబ్బంది మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షణ గావించారు.అనంతరం మూల విరాటకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ ప్రాంగణంలో విలీన ప్రక్రియ కార్యక్రమం చేపట్టి, మునుపటి ఆలయ కార్యవర్గాన్ని శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక మండల అధ్యక్షుడు మేడా విజయ బాస్కర్ రెడ్డి,ఆలయ పూర్వ చైర్మన్ అరిగేల సౌమిత్రి చంద్రనాధ్, టీటీడీ డిప్యూటీ ఇఓ నటేష్ బాబు,హెచ్ ఆర్.డిప్యూటీ ఇఓ గోవింద రాజులు,టెంపుల్ జనరల్ సెక్షన్ గుణభూషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శాస్రోక్తంగా ఎండో మెంట్ నుంచి టీటీడీకి ఆలయ ఆస్తులను సమర్పించారు.వ్రాత పూర్వకంగా బాధ్యత లను టీటీడీ అధికారులు స్వాధీనం చేసు కున్నారు.ఈ సందర్భంగా టీటీడీ డిప్యూటీ ఇఓ నటేష్ బాబు మాట్లాడుతూ సౌమ్యనాధ స్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం స్వాదినం చేసుకున్నట్టు వెల్లడించారు. ఇక నుంచి స్వామి వారి అన్నీ కార్యక్రమాలు టీటీడీ ఆధ్వర్యంలో జరుపనున్నట్టు వెల్లడించారు.

కాగా ఆలయం టీటీడీ లో విలీనం చేయాలని గతంలో స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి కోరగా అందుకు టీటీడీ బోర్డు సమావేశంలో గతంలో నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఇప్పుడు విలీన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. కాగా ఆలయ విలీనం పై రగడ జరుగుతుందన్న ప్రచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.గతంలో ఉన్న ఆలయ సిబ్బంది తో పాటూ, ఆలయ బోయిలను కుడా కొనసాగించాలని కోరికను టీటీడీ అధికారులు సమ్మతించారు.కాగా జులై 31 2021లో సత్యం న్యూస్ లో శ్రీ సౌమ్యనాధ స్వామి ఆలయం టీటీడీ స్వాధీనం కు రంగం సిద్ధం అంటూ అప్పట్లో ముందే కథనం ప్రచురించింది.

Related posts

ములుగులో నరేంద్రమోడీ చిత్రపటానికి పాలాభిషేకం

Satyam NEWS

హుజూర్ నగర్ లో జననేతకు జయంతి వేడుక

Satyam NEWS

నల్లమలలో యురేనియం తవ్వకాలు చేయడం లేదు

Satyam NEWS

Leave a Comment