29.7 C
Hyderabad
May 3, 2024 04: 28 AM
Slider ప్రపంచం

ట్విట్టర్ లో డోనాల్డ్ ట్రంప్ కుంభకోణం?

#trump

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ట్విట్టర్‌లోకి వచ్చారు. ఆయన ట్విట్టర్ ఖాతా బ్లూ టిక్‌తో పునరుద్ధరించిన విషయం తెలిసిందే. ట్రంప్‌కి ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ట్రంప్ అకౌంట్ యాక్టివేట్ అయిన కొద్ది నిమిషాల్లోనే అతనికి 1 మిలియన్ ఫాలోవర్లు వచ్చారు. ఇప్పుడు ఈ సంఖ్య పై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి ట్రంప్ ట్విట్టర్ ఫాలోవర్లలో స్కామ్ జరుగుతుందని ట్విట్టర్ వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

ఒక రోజు క్రితం, ట్విట్టర్ కొత్త యజమాని ఎలోన్ మస్క్, ట్రంప్ ట్విట్టర్ ఖాతా నుండి నిషేధాన్ని తొలగించడానికి ఒక పోల్ నిర్వహించారు. ఆ పోల్ ప్రకారం ట్రంప్ ట్విట్టర్‌కి తిరిగి వచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్‌లోకి రావడంతోనే ట్రంప్‌కు 2,000 మంది అనుచరులు కనిపించారు. కొద్ది కాలంలోనే ట్రంప్‌ ఫాలోవర్లు లక్షల్లో పెరిగారు. వైట్ హౌస్ పై అనుచరుల దాడి తర్వాత అంటే 2021 జనవరి 8న డోనాల్డ్ ట్రంప్‌ను ట్విట్టర్ నిషేధించింది.

ట్రంప్ ఖాతా నిషేధించినప్పుడు ఆయనకు 2.3 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక విశ్లేషణ లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా ఫాలోవర్లు 10 మిలియన్లు కనిపిస్తుండగా మరో చోట 15.2 మిలియన్లు కనిపిస్తున్నారట. దీని వెనుక కుట్ర ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ట్విట్టర్ ను ట్రంప్ మేనేజి చేస్తున్నారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Related posts

దళిత బంధు నిధులను వెంటనే ఇవ్వాలి

Satyam NEWS

బిచ్కుంద చెరువులో తొంభై ఏడు వేల చేప పిల్లల విడుదల

Satyam NEWS

గుడ్ వర్క్: మహిళల రక్తదాన శిబిరానికి విశేష స్పందన

Satyam NEWS

Leave a Comment