ఆంధ్రప్రదేశ్ ను 25 జిల్లాలుగా విడగొట్టాలనే ప్రతిపాదన సిద్ధమౌతున్నదని రాజ్యసభ సభ్యుడు, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన విజయ సాయిరెడ్డి తెలిపారు. అంతే కాకుండా ఇప్పుడు రాజధాని ఏర్పాటు చేసే ప్రాంతం భీమిలి నియోజకవర్గం కిందికి వస్తుందని ఆయన అన్నారు.
రాజధానికి అవసరమైన భూముల కోసం విశాఖపట్నం ప్రాంతంలో సర్వే చేస్తున్నామని చెప్పారు. విశాఖ, భీమిలిలలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ‘ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతం. దాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతోనే విశాఖలో రాజధానిని నెలకొల్పాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
భీమిలి మహాపట్టణంగా వెలుగొందనుంది అని ఆయన పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చట్టానికి లోబడి శిక్ష పడుతుందని, కొన్ని శక్తుల వల్ల ఆయన తప్పించుకుంటున్నారని, భవిష్యత్తులో అలా జరగదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.