27.7 C
Hyderabad
May 12, 2024 05: 39 AM
Slider ఆదిలాబాద్

పిట్లం మండల కేంద్రంలో ఆసుపత్రికి నూతన భవనం

#pitlam

కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించబోతున్న ముప్పై పడకల ఆసుపత్రి భవనానికి జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే నేడు భూమి పూజ చేశారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో 10.70 కోట్ల రూపాయల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులతో కలిసి బిల్డింగ్ నమూనా పరిశీలించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అందులో భాగంగా పిట్లం మండల కేంద్రంలో 30 పడకల నూతన ఆసుపత్రి నిర్మాణం జరుగుతోందని తెలిపారు. భవన నిర్మాణానికి అడిగిన వెంటనే రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు 10.70 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని తెలిపారు.

అతి తక్కువ సమయంలోనే టెండరు కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈ రోజు నుతన ఆసుపత్రి భవనానికి భూమి పూజ, ముగ్గు పోయడం జరిగింద న్నారు. ఈ ఆసుపత్రిని శీఘ్రగతిన నిర్మించి పిట్లం మండల ప్రజలకు అందుబాటులో వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. వైధ్యాధికారులు స్థానిక ఎమ్మెల్యే ని  పూలమాలవేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, వైద్యాధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

జి లాలయ్య సత్యం న్యూస్ జూకల్ నియోజకవర్గం

Related posts

విశాఖ నుంచి తెలంగాణ మంత్రి మాట్లాడుతూ…

Satyam NEWS

మూడేళ్లుగా వేధిస్తున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS

మహిళా సంరక్షక పోలీసులు శాంతిదూతలుగా పని చేయాలి

Satyam NEWS

Leave a Comment