38.2 C
Hyderabad
April 29, 2024 14: 35 PM
Slider ముఖ్యంశాలు

విద్యార్థుల ఆత్మహత్యలకు నిలయంగా మారిన శ్రీ చైతన్య విద్యాసంస్థలు

#srichitanya

కార్పోరేట్ విద్యాసంస్థలను తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ అన్నారు. గురువారం  ఏఐఎస్ఎఫ్ మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలని స్థానిక ఉప్పల్ డిపో వద్ద ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కార్పోరేట్ విద్యాసంస్థల ఆగడాలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడంలేదని, రంగారెడ్డి జిల్లా నార్సింగి శ్రీ చైతన్య విద్యా సంస్థలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్ అనే విద్యార్ధి యాజమాన్య వేధింపుల వల్ల తన తరగతి గదిలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కొనఊపిరితో ఉన్న సాత్విక్ ని ఆసుపత్రికి తరలించకుండా నిర్లక్ష్యం వహించి తన ప్రాణాన్ని కాపాడలేకపోయారు.

ఇది ముమ్మాటికీ శ్రీ చైతన్య విద్యాసంస్థ యాజమాన్యం చేసిన హత్య. శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో జరుగుతున్న వరుస ఆత్మహత్యలపై ప్రభుత్వం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కార్పోరేట్ విద్యాసంస్థలను రద్దు చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్, కానీ నేడు అదే కార్పోరేట్ విద్యాసంస్థలకు రెడ్ కార్పెట్ వేసి విచ్చల విడిగా ఫీజుల దోపిడీ చేస్తున్న, అనుమతులు లేకున్నా వారు చేస్తున్న ఆగడాలకు పరోక్షంగా సహకరిస్తూ విద్యార్ధి జీవితాలతో చెలగాటమాడుతున్నది రాష్ట్ర ప్రభుత్వం.

కార్పోరేట్ విద్యాసంస్థల్లో జరుగుతున్న వరుస ఆత్మహత్యలపై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేపించాలని, విద్యార్ధి మరణాలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, ఇంటర్ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి కళాశాలలో  సైకాలజిస్టులు,డాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని, విద్యార్థుల్లో మనోదైర్యం నింపే విధంగా తగు కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ఎండీ అన్వర్, జిల్లా నాయకులు హరీష్, మహేష్,వినయ్, శివ, మనోహర్, వెంకట్ , రాము ,నరేష్ , చిన్న , బన్నీ  తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

ఖాకీ ఛీటింగ్: అమ్మాయిని ట్రాప్ చేసిన పోలీసు అధికారి

Satyam NEWS

అమీర్ పేట హోటల్ ఆదిత్య పార్క్ లో కేరళ ఫుడ్ ఫెస్టివల్

Satyam NEWS

మూడు రోజుల పర్యటనకు ఏపి రానున్న అమిత్ షా

Satyam NEWS

Leave a Comment