40.2 C
Hyderabad
May 6, 2024 17: 49 PM
Slider ప్రత్యేకం

తెలంగాణలో రూ.215 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న డీపీ వరల్డ్

#FDI

తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. దుబాయ్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. ప్రపంచ స్థాయి కంపెనీలతో సమావేశమవుతూ బీజిగా ఉన్నారు. తాజాగా ప్రపంచ స్థాయి దిగ్గజ పోర్టు ఆపరేటివ్ డీపీ వరల్డ్ సంస్థ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. అగ్నిమాపక సామాగ్రి తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన యూఏఈ దిగ్గజ సంస్థ నాఫ్కో(NAFFCO) కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో రూ. 700 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రపంచ స్థాయి దిగ్గజ పోర్టు ఆపరేటివ్ డీపీ వరల్డ్ సంస్థ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్రంలో రాష్ట్రంలో రూ. 215 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు డీపీ వరల్డ్ సంస్థ ప్రకటించింది. దుబాయ్‌లో కేటీఆర్‌తో డీపీ వరల్డ్ సంస్థ ప్రతినిధులు చర్చలు జరిపిన అనంతరం ఈ విషయాన్ని ప్రకటించారు. హైదరాబాద్‌లో ఇన్‌లాండ్ కంటైనర్ డిపో ఆపరేషన్ కోసం డీపీ వరల్డ్ పెట్టుబడులు పెట్టనుంది. రూ. 165 కోట్లతో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు వెల్లడించింది. మేడ్చల్‌లో రూ. 50 కోట్లతో కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌజ్ నిర్మించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. డీపీ వరల్డ్ లాజిస్టిక్స్‌లో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు డీపీ వరల్డ్ ముందుకు రావడం సంతోషకరమన్నారు. డీపీ వరల్డ్‌కు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

Related posts

తెలంగాణలో గ్రౌండ్ కోల్పోయిన కేసీఆర్

Satyam NEWS

ఐటిఐఆర్ ను మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదు

Satyam NEWS

వార్ కంటిన్యూస్: ఇరాక్ అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడి

Satyam NEWS

Leave a Comment