40.2 C
Hyderabad
May 2, 2024 18: 44 PM
Slider ప్రపంచం

Big News : కరోనా వైరస్ కు విరుగుడుగా ఇన్ హేలర్

#Corona Inhelar

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా ను నియంత్రించేందుకు ఏం చేయాలి? వ్యాక్సిన్ వేయించుకోవాలి. అంతేనా? అంతేనా అంటే కాదు ఇంకా ఉంది.

ఇజ్రాయిల్ కు చెందిన ఒక ప్రొఫెసర్ ఒక అడుగు ముందుకు వేసి వ్యాక్సిన్ తో కూడా పని లేని విధానాన్ని కనిపెట్టారు. ఆయన ఒక అద్భుతమైన ఇన్ హెలర్ ను రూపొందించారు.

సాధారణంగా జలుబు చేసినప్పుడు ముక్కు దిబ్బడ వేసినప్పుడు వాడే ఇన్ హెలర్ లాంటిదే ఇది.

ఈ ఇన్ హెలర్ ను వాడితే కరోనాను ఐదు రోజుల్లో నయం చేయవచ్చునని ఆయన శాస్త్రీయంగా నిరూపిస్తున్నారు.

ఆ ప్రొఫెసర్ పేరు నద్రీ అబిర్. ఇజ్రాయిల్ లోని టెల్ అవివ్ లోని సోరాస్కీ మెడికల్ సెంటర్ లో కరోనాతో చేరిన రోగులకు ఆయన ఈ ఇన్ హెలర్ ఇచ్చాడు.

ఆశ్చర్యకరంగా 96 శాతం సమర్థతతో ఈ ఇన్ హెలర్ పని చేసినట్లు రుజువు అయింది.

దాదాపుగా 30 మంది కరోనా రోగులకు ఈ ఇన్ హెలర్ ఇవ్వగా వారిలో గణనీయమైన మార్పులు వచ్చాయి.

మూడు నుంచి ఐదు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కూడా అయ్యారు.

కరోనా రోగకారక వైరస్ ను నిర్మూలించేందుకు సిడి24 కలిగి ఉన్న ఎక్సోసోములను ఈ ఇన్ హెలర్ లో ఉంచినట్లు ప్రొఫెసర్ నద్రీ తెలిపారు.

తాను రూపొందించిన ఇన్ హేలర్ కు ఇంకా జాతీయ అంతర్జాతీయ సంస్థల నుంచి అనుమతులు రాలేదని తెలిపారు.

Related posts

శంకరమ్మకు MLC పదవి?

Bhavani

మంత్రి కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన బన్నాల గీత

Satyam NEWS

భారీ వర్షాలతో కళకళలాడుతున్న ఎత్తిపోతల

Satyam NEWS

Leave a Comment