28.2 C
Hyderabad
May 9, 2024 02: 33 AM
Slider కడప

షర్మిలపార్టీ అన్న తరపు తెలంగాణ కు రిటర్న్ గిఫ్ట్…

#CPINarayana

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నందలూరు లోని ఓ కార్యక్రమంకు విచ్చేసారు. ఈసందర్భంగా వైసీపీ ప్రభుత్వం పై,షర్మిల నూతన పార్టీపై, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

కడపజిల్లా రాజంపేట నందలూరు లో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా లో షర్మిల రాజకీయ ప్రవేశం రిటర్న్ గిఫ్ట్ లా ఉందన్నారు. కేసీఆర్ వీళ్ళకి గిఫ్ట్ ఏపీలో ఇచ్చాడు, వాళ్ళకి షర్మిల రిటర్న్ గిఫ్ట్ ఇస్తోంది, అంతకన్నా వీళ్ళు సాధించేది లేదని అన్నారు.

షర్మిల పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి ఔతోంది అనుకోవడం కళ్ళ అని ఇతర పార్టీలకు సపోర్ట్ ఇవ్వడం కోసంమే ఇదంతా అన్నారు.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిన తరువాత రాజకీయ వ్యవస్థ కలగాపులగం అయ్యిందని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి గారి ప్రేరణతో వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆయన లక్షణాలు ఒక్క పర్సెంటేజ్ కూడా రాలేదన్నారు.

ఎవరికి తెలియని ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని దేశంలోనే ఫేమస్ అయ్యారన్నారు.

జగన్మోహన్ రెడ్డి కి నిమ్మగడ్డ కృతజ్ఞతలు తెలిపాలని కోరారు. ఏపీ లో ఉన్న గవర్నర్ పనికిమాలిన గవర్నర్ అని ఉత్సవ విగ్రహం లా ఉన్నాడని, ఒక్కప్పుడు రాంలాల్ పనికిమాలిన గవర్నర్ ఉంటే,ఇప్పుడు అంతకన్నా పనికిమాలిన గవర్నర్ ఉన్నాడని ఆరోపించారు.

జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి అని ఢిల్లీలో ఐ ఏ.యస్ లు చెప్పుకుందుకు సిగ్గు పడు తున్నారని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణ పై వైసీపీ ఇక్కడ గాండ్రిపులు చేసి ఢిల్లీ లో పిల్లి లాగా ఉంటే ఎలా అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాలు రాయడం వలన ఉపయోగం లేదని,రాజశేఖర్ రెడ్డి లా ఢిల్లీకి అఖిలపక్షంను తీసుకు పోయి చర్చలు చేస్తే ఫలితం ఉంటుందన్నారు.విశాఖ ఉక్కు పోగొట్టుకుంటే రాష్టంలో మిగతా అభివృద్ధి పథకాలకు, రాజధానికి నిధులు రావని అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు.

Related posts

రెజర్లకు మద్దతుగా సంతకాల సేకరణ

Bhavani

29న రోమ్ వెళుతున్న ప్రధాని నరేంద్ర మోడీ

Satyam NEWS

సకాలంలో పంట ఋణాలు చెల్లించి లబ్ది పొందండి

Satyam NEWS

Leave a Comment