40.2 C
Hyderabad
May 2, 2024 16: 50 PM
Slider మహబూబ్ నగర్

అనుమానాస్పదంగా తిరిగాడు పోలీసులకు దొరికాడు

#WanapartyPolice

చేసిన అప్పులు తీర్చుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేస్తాం…. బైక్ లు చోరీ చేద్దాం అంటున్నాడు ఈశ్వరయ్య. వనపర్తి, నాగర్ కర్నూలు, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 29 ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసినట్లుగా అతను ఒప్పుకున్నాడని వనపర్తి డీఎస్పీ కెఎం కిరణ్ కుమార్ తెలిపారు.

శుక్రవారం మధ్యాహ్నం వనపర్తి పట్టణంలోని  గాంధీ చౌక్ చౌరస్తా దగ్గర వనపర్తి పట్టణ ఎస్సై వెంకటేష్ గౌడ్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పద పరిస్థితుల్లో ఈశ్వరయ్య కనిపించాడు. ఈశ్వరయ్య అతని స్నేహితుడిని పోలీసులు ఆపి వారు ప్రయాణిస్తున్న వాహనానికి సంబంధించిన ధృవ పత్రాలను అడగడంతో తడబడుతూ లేవని చెప్పారు.

ఎస్సై వెంకటేష్ గౌడ్ కు అనుమానం రావడంతో  అదుపులోకి తీసుకుని వనపర్తి పట్టణ పోలీస్టేషనుకు తీసుకువెళ్లి విచారించగా వారు బైక్ చోరీ చేసేవారని వెల్లడైంది. వారి వద్ద నుండి 29 ద్విచక్రవాహనాలను స్వాధీనం పరుచుకొని నేడు రిమాండ్ కు తరలించారు.

ఈశ్వరయ్యతో బాటు పోలీసులు అరెస్టు చేసిన వారిలో చీర్ల కృష్ణయ్య, మంగ్యా నాయక్, ఎం. డీక్యా, ఎండి. ఖాదర్ లు ఉన్నారు. ఈశ్వరయ్య ఫైనాన్స్ లో ఆటో తెచ్చుకొని పెద్దగూడెం నుండి వనపర్తికి ఆటో నడిపే వాడు. ఆటో సరిగా నడవక పోవడం, చాలీ చాలని జీవనంతో అప్పులు కావడంతో ఆ అప్పులు తీర్చడానికి అమాయకులను మోసపూరితంగా మాయమాటలు చెప్పి బంగారు కమ్మలు దొంగలించాడు.

ఆ నేరంపై వనపర్తి పోలీస్టేషన్లో కేసు నమోదు కాగా జైలుకు వెళ్లాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత ఆగక వరుస దొంగతనాలతో మహబూబ్ నగర్ టౌన్, మహ్మదబాద్ జడ్చర్ల, బిజినపల్లి, వనపర్తి టౌన్, వనపర్తి రూరల్ పోలీస్టేషన్ల పరిధిలో పలు చోరీలకు పాల్పడ్డాడు.

అయినా అప్పులు తీరకపోవడంతో ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసి తొందరగా డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు. దొంగతనం చేసిన దొంగ వాహనాలు నాటవెళ్లి తండాకు చెందిన మంగ్యానాయక్, డీక్యా నాయక్, కడుకుంట్ల గ్రామానికి చెందిన ఖాదర్, అనే వ్యక్తులు కొనుగోలు చేసేవారు. ఈ కేసు పరిశోధనలో వనపర్తి సీఐ సూర్యనాయక్, వనపర్తి పట్టణ ఎస్సై వెంకటేష్ గౌడ్, గోపాల్ పేట ఎస్సై, రామన్ గౌడ్, ఏఎస్సై, బాషా, హెడ్ కానిస్టేబుల్, శ్రీనివాస్ రెడ్డి,

కానిస్టేబుళ్లు శ్రీనువాస్, నవీన్ కుమార్ గౌడ్, మహమ్మద్ ఆలీ, శ్రీశైలంచారి, రవికుమార్, నాగరాజు, హోంగార్డులు సహదేవుడు, విష్ణు, రాజుకుమార్, ఉన్నారు. వీరిని డిఎస్పీ  ప్రత్యేకంగా అభినందించారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

జగనన్న జోరుకు బాలినేని బ్రేక్

Satyam NEWS

టాటా మోటార్స్ నుంచి ఎలక్ట్రిక్ కారు విడుదల

Satyam NEWS

అమృతమే

Satyam NEWS

1 comment

POLISHETTI BAALAKRISHNA.9697297296 December 26, 2020 at 8:01 PM

Sur
వార్త బాగుంది

Reply

Leave a Comment