26.7 C
Hyderabad
May 3, 2024 10: 17 AM
Slider ముఖ్యంశాలు

ఆరేళ్లు గడుస్తున్నా గౌడ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే

#GowdaProblems

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు ఆరు సంవత్సరలు గడుస్తున్నా రాష్ట్రంలోని గౌడ కులస్తుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని,ఎన్ని ప్రభుత్వ లు మారినా కల్లు గీత వృత్తి రాత మారడం లేదని సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం ఆధ్వర్యంలో కల్లు గీత కార్మికుల ఆత్మగౌరవ యాత్ర పేరుతో పాదయాత్ర చేశారు.

 సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ని పాఠ్యంశంగా పెట్టాలని,పాపన్న విగ్రహం ట్యాంకుబండ్ పై ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ వెంటనే గౌడ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5000వేల కోట్ల బడ్జెట్ ను కేటాయించాలని కోరుతూ భారీ పాదయాత్ర చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో గౌడ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో ఈడిగ కులస్తులు కల్లు గీత కార్మికుల ఆత్మగౌరవ యాత్ర పాదయాత్ర చేశారు. మాధవస్వామి ఆలయం నుండి పోలీస్ స్టేషన్ చౌరస్తా మీదుగా భారీ పాదయాత్ర నిర్వహించారు.

తహశీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. పలు డిమాండ్ల పై తహశీల్దార్ కి వినతిపత్రం అందజేశారు. అనంతరం స్థానిక మహబూబ్ ఫంక్షన్ హల్ లో సమావేశం నిర్వహించారు. గౌడ కులస్తుల సమస్యల పై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.

ప్రతి గ్రామంలో జీవో 560 ప్రకారం ప్రతి గ్రామ గౌడ సొసైటీ కి 10ఎకరాల భూమిని కేటాయించాలని, ఔషద గుణాలున్న కల్లును నీరగా అభివృద్ధి చేసి నిల్వచేసి ప్రభుత్వమే బాటిలింగ్ చేసి అమ్మలని డిమాండ్ చేశారు. చెట్టు మీది నుండి చనిపోయిన గీతకార్మికునికి 10లక్షల రూ,శాశ్వత వికలాంగుడికి 5లక్షలు,దెబ్బలు తగిలిన కార్మికుడికి  3లక్షల రూ,ఎలాంటి ఆంక్షలు లేకుండా 2నెలల్లో ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రతి గీత కార్మికుడికి పూర్తి సబ్సిడీపై ద్విచక్ర వాహనాన్ని అందించాలని, కల్లు ద్వార చక్కెర బెల్లం చాక్లెట్, తాటి తాండ్ర యూనిట్లు ఏర్పాటు చేసి గౌడ కార్మికులకు ఉపాధి కల్పించాలన్నారు. పాపన్న జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని,ప్రతి గీత కార్మికుడికి 3016రుల పెన్షన్ అందించాలని కోరారు.

ప్రతి కార్మికుడు సులభంగా తాటిచెట్లు ఎక్కడానికి పూర్తి సబ్సిడీ తో యంత్రాలు అందించాలని, కేంద్ర ప్రభుత్వం టాడి టాపర్ బోర్డ్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర నాయకులు,స్థానిక గౌడ ప్రజాప్రతినిధులు, గౌడ నాయకులు,కల్లు గీత కార్మికులు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా వావిలాల గోపాలకృష్ణయ్య జయంతి వారోత్సవ వేడుకలు

Satyam NEWS

పోతిరెడ్డిపాడుపై రాజీలేని పోరాటం చేస్తున్నాం

Satyam NEWS

కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ

Satyam NEWS

Leave a Comment