34.2 C
Hyderabad
May 10, 2024 12: 44 PM
Slider సినిమా

విలన్ టు హీరో: విలక్షణ నటనతో రెబెల్ స్టార్

#bhaktakannappa

తెలుగు చలన చిత్ర సీమకే ఆయన రెబల్ స్టార్. అగ్ర కథానాయకుల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ సినీ రంగ ప్రవేశం చేసి హీరోగా తనను తాను నిరూపించుకోవడం అంటే అందరికి సాధ్యం కాదు. అది ఒక్క కృష్ణంరాజుకే సాధ్యమైంది. అందుకే ఆయన రెబల్ స్టార్ అయ్యారు. కెరీర్ ఆరంభంలో విలన్ పాత్రలు వేసిన కృష్ణంరాజు ఆ తర్వాత హీరోగా సెటిల్ అయ్యారు.

అమరదీపం లో అద్భుత నటన చూపిన ఆయన భక్త కన్నప్పగా ప్రేక్షకుల జేజేలు అందుకున్నారు. ఆయన 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఉన్నత కుటుంబంలో పుట్టారు. చదువు పూర్తి కాగానే జర్నలిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించారు.

ఆ తర్వాత మిత్రుల ప్రోత్సాహంతో సినీరంగంలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మద్రాసు చేరుకున్నారు. ప్రముఖ దర్శకుడు ప్రత్యగాత్మ తొలి అవకాశం కల్పించారు. 1966లో వచ్చిన చిలకా గోరింకా చిత్రంతో కృష్ణంరాజు హీరో అయ్యారు. అయితే తొలి చిత్రం ఆయనకు నిరాశ మిగిల్చింది. సీనియర్ నటుడు సీహెచ్​ నారాయణరావు వద్ద నటనలో శిక్షణ తీసుకున్న కృష్ణంరాజు అవేకళ్లు చిత్రంలో విలన్‌గా నటించారు.

ఆ చిత్రంలో విలన్‌ పాత్రలో ఆయన నటనకు విమర్శకుల నుంచీ కూడా ప్రశంసలు అందుకున్నారు. అప్పటికే ప్రఖ్యాత విలన్‌ ఆర్‌ నాగేశ్వరరావు చనిపోవడంతో అంతా కృష్ణంరాజును మరో ఆర్‌ నాగేశ్వరరావు తెలుగు తెరకు వచ్చారన్నారు.’అవే కళ్లు’ చిత్రంలో విలన్‌గా మంచి గుర్తింపు వచ్చింది.

30 సినిమాల్లో విలన్ వేషాలు…

‘అవే కళ్లు’ చిత్రంలో విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణంరాజు తర్వాత వరుసగా 30 సినిమాల్లో విలన్‌ వేషాలే వేశారు. ఎన్టీఆర్​, ఏఎన్నార్​, శోభన్‌బాబు, కృష్ణ చిత్రాల్లో విలక్షణమైన ప్రతినాయకుడి పాత్రలు పోషించి యంగ్‌ విలన్‌గా పేరు తెచ్చుకున్నారు. విలన్‌ వేషాల తర్వాత పలు చిత్రాల్లో హీరో సపోర్టింగ్‌ క్యారెక్టర్స్‌ కూడా లభించాయి

ఆయనకు ఎన్టీఆర్​తో ‘భలేమాస్టార్‌’, ‘బడిపంతులు’, ‘వాడేవీడు’, ‘పల్లెటూరి చిన్నోడు’, ‘మనుషుల్లో దేవుడు’, ‘మంచికి మరోపేరు’, ‘సతీసావిత్రి’ చిత్రాల్లో నటించారు. అక్కినేని కాంబినేషన్‌లో బుద్ధిమంతుడు, జైజవాన్‌, పవిత్రబంధం, మంచిరోజులు వచ్చాయి, మాతృమూర్తి చిత్రాల్లో విలన్‌గా నటించి మెప్పించారు. ఏఎన్నార్​ హీరోగా తెరకెక్కిన ‘ఎస్పీ భయంకర్‌’ చిత్రంలో సపోర్టింగ్‌ హీరోగా నటించారు.

హీరో కృష్ణ కాంబినేషన్‌లో 17 చిత్రాల్లో హీరోగా నటించారు కృష్ణంరాజు. శోభన్‌బాబుతో బంగారు తల్లి, మానవుడు దానవుడు, జీవనతరంగాలు చిత్రాల్లో విలన్‌గా నటించారు. ఇద్దరు ఇద్దరే, కురుక్షేత్రం, రామబాణం, జీవితం చిత్రాల్లో సపోర్టింగ్‌గా నటించారు. ప్రత్యగాత్మ దర్శకత్వంలో వచ్చిన ఇంటిదొంగలు చిత్రంతో కృష్ణంరాజు మళ్లీ హీరోగా మారారు.

అయితే ఆ చిత్రం లేడీ ఓరియంటెడ్‌ అయినప్పటికీ ప్రత్యగాత్మతో ఉన్న అనుబంధం కారణంగా ఒప్పుకున్నారు. విలన్‌గా వెలుగొందుతున్న రోజుల్లోనే గోపికృష్ణా మూవీస్‌ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి వరుసగా చిత్రాలు నిర్మించారు. స్వంత బ్యానర్‌లో వచ్చిన తొలి చిత్రం కృష్ణవేణి. ఆ చిత్రం పన్నెండు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఆ చిత్రంతో ఆయన హీరోగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

వరుసగా బయటి నిర్మాణ సంస్థల నుంచి హీరోగా అవకాశాలు రావడంతో బిజీగా మారిపోయారు. సొంత బ్యానర్‌ గోపికృష్ణా మూవీస్‌లో కృష్ణంరాజు నటించిన రెండో చిత్రం భక్తకన్నప్ప. అప్పట్లో ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టింది. ఆయన కేరీర్‌లోనే గొప్ప చిత్రంగా మిగిలిపోయింది. చిత్రం విడుదల అయిన అన్నీ కేంద్రాల్లో 25 వారాలు ఆడింది. క్లైమాక్స్‌లో భక్తకన్నప్ప కన్ను పెకిలించి శివునికి అర్పించే సన్నివేశానికి థియేటర్లలో అద్భుతమైన స్పందన వచ్చింది.

1984లో బొబ్బిలి బ్రహ్మన్న చిత్రాన్ని చేశారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా.. అఖండ విజయాన్ని సాధించింది. కృష్ణంరాజులోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. బొబ్బిలి బ్రహ్మన్న తర్వాత చారిత్రక చిత్రాన్ని చేయాలన్న కోరిక తో తాండ్ర పాపా రాయుడు లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. రంగూన్‌ రౌడీ, కటకటాల రుద్రయ్య చిత్రాలు కృష్ణంరాజుకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

విలక్షణ నటనతో విశ్వరూపం

బాపు దర్శకత్వంలో వచ్చిన బుల్లెట్‌ చిత్రంలో మొరటోడిగా నటించి మెప్పించారు కృష్ణంరాజు. త్రిశూలం, బెబ్బులి, పులి బెబ్బులి, పలనాటి బ్రహ్మనాయుడు, విశ్వనాథ నాయకుడు, రంగూన్‌ రౌడీ, పులిబిడ్డ, ఉగ్రనరసింహం, ధర్మాత్ముడు, ధర్మతేజ చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. కృష్ణంరాజు విలక్షణమైన నటనా శైలి కారణంగా ఆయన్ను ఎన్నో అవార్డులు వరించాయి.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1977లో అమరదీపం చిత్రానికి, 1984లో బొబ్బిలి బ్రహ్మన్న చిత్రంలో ఆయన ప్రదర్శించిన నట విశ్వరూపానికి నంది అవార్డులతో సత్కరించింది. 1986లో తాండ్రపాపారాయుడు చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్న కృష్ణంరాజు 2006లో ఫిల్మ్‌ఫేర్‌ దక్షిణాది జీవితసాఫల్య పురస్కారాన్ని తీసుకున్నారు.

Related posts

కీలక కేసుల్లో క్వాలిటీ ఇన్ వెస్టిగేషన్ ఉండాలి

Satyam NEWS

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో 13 లక్షల కోట్ల పెట్టుబడులు

Satyam NEWS

రిటర్నింగ్ అధికారిగా మైనారిటీ తీరని బాలుడు

Satyam NEWS

Leave a Comment