28.7 C
Hyderabad
April 27, 2024 03: 58 AM
Slider మహబూబ్ నగర్

కీలక కేసుల్లో క్వాలిటీ ఇన్ వెస్టిగేషన్ ఉండాలి

#gadwalSP

ఫోక్సో ఎస్సీ ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని జోగుళాoబ గద్వాల్ జిల్లా జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ ఆదేశించారు. నేడు జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులతో జిల్లా పోలీస్  కార్యాలయంలో పెండింగ్ కేసులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

పెండింగ్ ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాను గ్రేవ్ కేసుల గురించి  సిఐలను, ఎస్ఐలను అడిగి తెలుసుకొని, (యస్ ఓ పి) ప్రకారం సిడి ఫైళ్ళల్లో ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉందో పరిశీలించారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలి. పూర్తి పారదర్శకంగా కేసులో ఇన్వెస్టిగేషన్ చేయాలి. పెండింగ్ ఉన్న సీసీ నెంబర్లు త్వరగా తీసుకోవాలని సూచించారు. కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలని అన్నారు. కేసుల్లో కోర్టు ట్రయల్ సమయంలో  సాక్షులకు సరైన విధంగా బ్రీఫింగ్ చేసి ప్రవేశపెట్టడం ద్వారా శిక్షల శాతం పెంచేందుకు కృషి  చేయాలనీ అన్నారు.

ఎస్సీ ఎస్టీ పోక్సో కేసులలో 60 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేయాలని, పారదర్శకంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని అన్నారు. రౌడీలు, కేడీలు, సస్పెక్ట్ ల యొక్క కదలికలపై  నిరంతరం నిఘాపెట్టాలి, ప్రతి కేసులో ప్రతి కేసులో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలన్నారు. సైబర్ నేరాల్లో త్వరితగతిన పరిశోధన పూర్తి చేయాలన్నారు. టార్గెట్ పెట్టుకొని పెండింగ్ ఉన్న కేసులను తగ్గించాలన్నారు.

దొంగతనాల కేసుల్లో ప్రతిరోజు కేసు చేద న గురించి అన్ని కోణాల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎస్ఓపి ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి కేసులు ఛేదించాలని సూచించారు. ఈ పెట్టి కేసులు వెంటనే డిస్పోజల్ చేయాలని సూచించారు. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పై ద్రుష్టి  సారించాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం విజబుల్  పోలీసింగ్ లో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. రాత్రి పెట్రోలింగ్ అధికారులు లాడ్జిలు మరియు పాత నేరస్తులను తనిఖీ చేయాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు.

సిసిటిఎన్ఎస్ లో డాటా ఎంట్రీ ప్రతిరోజూ మానిటర్ చేయాలని సంబంధిత ఎస్ఐలకు సూచించారు. సీసీ కెమెరాలను ప్రతిరోజూ మానిటర్ చేయాలని పని చెయ్యని సీసీ కెమెరాలను వెంటనే బాగు చేయించాలని సూచించారు. వర్టికల్ వారిగా ఎంట్రీ చేసిన డాటాను నోడల్ అధికారులు ప్రతిరోజు తనిఖీ చేసుకోవాలని క్వాలిటీ డాటా ఎంట్రీ చేయాలని సూచించారు. మరియు విధినిర్వహణలో రోల్ క్లారిటీ, గోల్ క్లారిటీ  ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణ గురించి గ్రామాలలో పట్టణాలలో మరియు ప్రజలకు ప్రజాప్రతినిధులకు యువకులకు గ్రామాల విపిఓలు, పోలీస్ అధికారులు, సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని  సూచించారు. పోలీస్ స్టేషన్ లను, పోలీస్ కార్యాలయాలను  పరిశుభ్రంగా ఉంచుకునేందుకు అమలవుతున్న 5S ఇంప్లిమెంటేషన్ ను నిరంతరాయంగా కొనసాగించాలని అందుకు సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలని అన్నారు.

గ్రూప్ – 1ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బదీగా బందోబస్తు

16 వ తేదిన జరుగబోయే గ్రూప్- 1ప్రిలిమినరీ పరీక్ష కు పకడ్బదీగా  పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించి పోలీస్ అధికారులకు తగు సూచనలు చేయడం జరిగింది. జిల్లా కేంద్రంలోని 15 పరిక్ష కేంద్రాల్లో 4874 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ప్రతి కేంద్రం వద్ద ఉదయం 6 :00 గంటలకు బందోబస్తు ఫోర్స్ ను ఏర్పాటు చేసుకోవాలని, అభ్యర్థులను తనిఖీలు చేసి లోపలికి అనుమతించాలని, ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ను అనుమతించకుడదని సూచించారు. ఆ సమయంలో జిల్లా కేంద్రంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్ లను మూసి వేయించాలని పోలీస్ అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ బి. రాములు నాయక్, సాయుద  దళ డి. ఎస్పీ ఇమ్మనియోల్, ఎస్బి ఇన్స్పెక్టర్ శివకుమార్, డీసీ ఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, గద్వాల్,అలంపూర్ మరియు శాంతినగర్ సి. ఐ లు చంద్రశేఖర్, సూర్యనాయక్, శివ శంకర్, జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ ల  ఎస్సై లు, డీసీ ఆర్బీ ఏ. ఎస్సై దేవరాజు, సిబ్బంది, ఐటీ సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

ట్రాఫిక్ పోలీసుల అలెర్ట్.. తప్పిన పెను ప్రమాదం..!

Satyam NEWS

జులై 1న ఏవోబీ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు

Satyam NEWS

హైవే పై మొక్కలు పరిశీలించిన ఓ.ఎస్.డి.ప్రియాంక వర్గీస్

Satyam NEWS

Leave a Comment