శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి జన్మదినం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఆశ్రమములో 64వ తిరునక్షత్ర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తొలుత స్వామి వారు జ్ఞాన దీపాన్ని వెలిగించి, భక్తులకు ఆశీస్సులు, తీర్థప్రసాదాలు, ఆచార్యుల అనుగ్రహం అందజేశారు. లక్ష్మీ పూజ తో మొదలైన తిరునక్షత్ర ఉత్సవాలు ఆచారి తిరునక్షత్ర ఉత్సవాలు అనంతరం సుప్రభాత సేవ కార్యక్రమానంతరం తో పాటు జీయర్ అవార్డు పురస్కారాలను పండితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్వామివారికి శుభాకాంక్షలు తెలిపారు. ఆశ్రమం ఆహ్వానం మేరకు విచ్చేసిన దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును శ్రీ త్రిదండి జీయర్ స్వామి వారు మంగళ శాసనంతో ఆశీర్వదించి సన్మానించారు.
previous post