29.7 C
Hyderabad
May 7, 2024 06: 56 AM
Slider గుంటూరు

సూక్ష్మ నీటి సేద్యపు పరికరాల రాయితీ పునరుద్ధరించాలి

#kvvprasad

సూక్ష్మ నీటి సేద్యపు పరికరాలు, వ్యవసాయ యంత్రాల పైరాయితీని పునరుద్ధరించకపోతే మరోమారు ఆందోళన తప్పదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.వి.వి ప్రసాద్ హెచ్చరించారు. గురువారం తాడేపల్లిలోతన కార్యాలయం విలేకర్ల సమావేశం జరిగింది.

ఈ సందర్బంగా కె.వి.వి. ప్రసాద్ మాట్లాడుతూ వేసవి ఆరంభంలోనే భూగర్భజలాలు గణనీయంగా పడిపోయి అష్టకష్టాలు పడి సాగుచేసిన పంట సగంలోనే ఎండిపోయే కరువు పీడిత రాయలసీమ, ప్రకాశం జిల్లాలో మెట్ట ప్రాంతాలకు తక్కువ నీటితో పంటలు పండించే ఇజ్రాయిల్ టెక్నాలజీ బిందు, తుంపర సేద్యం సంజీవిని లాగా  ఉపయోగపడింది అన్నారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్ విధానం తీసుకువచ్చి కంపెనీలకు చెల్లించాల్సిన 1300 కోట్ల బకాయిలు చెల్లించకపోవడం వల్ల రాష్ట్రంలో 37 కంపెనీలు సూక్ష్మ నీటి సేద్యపు పరికరాల సరఫరాను పూర్తిగా నిలుపుదల చేశారని అన్నారు.

రాయితీ పునరుద్ధరించాలని గత నవంబర్ లో ఏపీ రైతు సంఘం చేపట్టిన చలో కమిషనరేట్ ఆందోళన కార్యక్రమంలో అధికారులు జనవరి నుండి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారన్నారు, కానీ రాయితీ పునరుద్ధరణపై విధి విధానాలు ఖరారు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని అనంతపురం కడప లో పలుమార్లు విజ్ఞప్తులు ధర్నాలు జరిగాయి అన్నారు. ఇటీవల 432 కోట్లు బకాయిలు విడుదల చేసినప్పటికీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోకుండానే రైతు భరోసా కేంద్రాల్లో రైతుల పేర్లు నమోదు చేసుకోవాలనడం రైతులను మభ్య పెట్టడం తప్ప మరొకటి కాదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం నిర్ణయించిన ధరలను కంపెనీలను ఒప్పించి రాయితీని నిర్ణయించి రైతుల వాటా మొత్తాన్ని చెల్లిస్తుఆన్ లైన్ లో పేర్లు నమోదు చెయించాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి 1190 కోట్లు అంచనా వ్యయంతో 1.50 లక్షల హెక్టార్లు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని  జి. ఓ. యం. యస్. నెం.44(07.07.2021) విడుదల చేసినప్పటికీ టెండరింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదన్నారు.

రైతు భరోసా కేంద్రాలు రైతు విత్తనం విత్తే మొదలు పండిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించి కొనుగోలు చేసే వరకు పూర్తి బాధ్యత వహిస్తూ రైతుల అవసరాలు తీర్చే విజ్ఞాన కేంద్రాలు అని చెప్పినప్పటికీ ఆచరణలో రైతులు స్థానికంగా వినియోగించే విత్తనాలు, ఎరువులు,పురుగుమందులు, వ్యవసాయం పనిముట్లు లేకపోవడంవల్ల అనివార్యంగా ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నదని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం వైఖరి వల్ల పెట్రోలు, డీజిల్, విత్తనాలు ఎరువులు పురుగు మందుల ధరలు అమాంతం పెరిగి పోయి పెట్టుబడుల భారం పెరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయరంగంపై ఇచ్చే రాయితీలను పూర్తిగా నిలుపుదల చేయడం వల్ల వ్యవసాయం తలకు మించిన భారంగా మారి,అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతులు ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం ఉందని అన్నారు.

ప్రభుత్వం తక్షణం సూక్ష్మ నీటి సేద్యపు పరికరాలపై ఇచ్చే రాయితీలుపునరుద్ధరించాలని, బిందు తుంపర వ్యవసాయ పరికరాలపై సన్న,చిన్నకారు ఎస్సీ ఎస్టీ రైతులకు ఉచితంగా ను, ఇతరులకు 90 శాతం, హెక్టారు పైబడిన వారికి ప్రాంతంతో సంబంధం లేకుండా 70 రాయితీతో పథకాన్ని ప్రారంభించక పోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని భవిష్యత్తులో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.

Related posts

చంద్రగ్రహణం కారణంగా కాణిపాకం ఆలయం మూసివేత

Bhavani

ఇటలీలో పాటలు పాడుతున్న చాణక్య

Satyam NEWS

తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ పరువు

Satyam NEWS

Leave a Comment