39.2 C
Hyderabad
May 3, 2024 14: 58 PM
Slider జాతీయం

పుట్టిన రోజు నాడు అమ్మ దగ్గరకు వెళ్లలేకపోయా

#modi

‘‘ఈ రోజు నేను మా అమ్మ దగ్గరకు వెళ్లలేకపోయాను, కానీ మధ్యప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాలలో, గ్రామాలలో కష్టపడి పనిచేసే ఈ లక్షల మంది తల్లులు ఈ రోజు నన్ను ఇక్కడ ఆశీర్వదిస్తున్నారు’’ అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారు. నేడు ఆయన 72వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. పుట్టిన రోజు నాడు సాధారణంగా నేను మా అమ్మ దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నిస్తాను. ఆమె పాదాలను తాకి ఆశీస్సులు పొందుతాను…. కానీ, ఈ రోజు వెళ్లలేకపోయాను అంటూ ఆయన కంటతడిపెట్టారు.

కునో నేషనల్ పార్క్‌లో చిరుతను విడిచిపెట్టే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన మధ్య ప్రదేశ్ లోని షియోపూర్ జిల్లాలోని కరాహల్ వచ్చారు. ఆ తర్వాత అక్కడ మహిళా స్వయం సహాయక సంఘాల సదస్సులో పాల్గొన్నారు. ప్రధానమంత్రి యోజన కింద నాలుగు నైపుణ్య కేంద్రాలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి తన పుట్టినరోజును ప్రస్తావించారని మోదీ అన్నారు. అయితే నాకు గుర్తులేదు… అని ఆయన అన్నారు. ఇంత మంది తల్లులు ఆశీర్వదిస్తున్న ఈ దృశ్యాన్ని చూసినప్పుడు తన తల్లి ఎంతో ఆనందిస్తుందని, కొడుకు తన వద్దకు రాలేకపోయినా, లక్షలాది మంది తల్లులు తనను ఆశీర్వదించారని సంతృప్తి చెందుతుందని మోదీ అన్నారు. ‘‘మీ ఆశీస్సులే మాకు స్ఫూర్తి’’ అని ఆయన అన్నారు.

దేశంలోని తల్లులు, సోదరీమణులు, కుమార్తెలే నాకు పెద్ద రక్షణ అని ప్రధాని మోదీ అన్నారు. మహిళ శక్తికి మూలం. గత ఎనిమిదేళ్లలో ఎస్‌హెచ్‌జిల సాధికారత కోసం మేము ఎంతో సహాయం చేసాము. దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల మందికి పైగా సోదరీమణులు ఈ ప్రచారంలో చేరారు. ఎనిమిది కోట్ల కుటుంబాలు ఈ పనితో ముడిపడి ఉన్నాయి. ప్రతి గ్రామీణ కుటుంబం నుండి కనీసం ఒక మహిళ ఈ పథకంలో చేరాలి. మధ్యప్రదేశ్‌లోని 40 లక్షల మంది మహిళలు కూడా స్వయం సహాయక సంఘాలతో సంబంధం కలిగి ఉన్నారు అని ఆయన తెలిపారు.

మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలను కల్పించేందుకు, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ద్వారా ప్రతి జిల్లాకు చెందిన స్థానిక ఉత్పత్తులను పెద్ద మార్కెట్‌లకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీంతో మహిళా స్వయం సహాయక సంఘాలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. గ్రామీణ సోదరీమణులు తయారు చేసిన ఈ ఉత్పత్తి దేశం మొత్తానికి వెలకట్టలేనిదని ఆయన అన్నారు.

మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ ప్రభుత్వం అటువంటి ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకెళ్లేందుకు విశేష కృషి చేస్తోందని మోదీ అన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల కోసం ప్రభుత్వం అనేక గ్రామీణ మార్కెట్లను ఏర్పాటు చేసింది. ఈ మార్కెట్లలో స్వయం సహాయక సంఘాలు రూ.500 కోట్లకు పైగా ఉత్పత్తులను విక్రయించాయి అని ప్రధాని తెలిపారు. ఈ డబ్బంతా గ్రామంలోని అక్కాచెల్లెళ్లకు చేరిందని ఆయన తెలిపారు.

75 ఏళ్ల తర్వాత చిరుత మళ్లీ మన గడ్డపైకి వచ్చిందని మోదీ అన్నారు. కొంతకాలం క్రితం కునోలో చిరుతలను విడుదల చేశారు. ఇప్పుడు మళ్లీ సుదూర ఆఫ్రికా నుండి చిరుతలను తీసుకువచ్చారు. అవి సుదీర్ఘ ప్రయాణం తర్వాత వచ్చాయి, మనకు గొప్ప అతిథులు వచ్చినట్లు అయింది అని ప్రధాని అన్నారు. ఈ అతిథుల గౌరవార్థం మనమందరం మన స్థానంలో నిలబడి రెండు చేతులూ పైకి లేపి స్వాగతం పలుకుదాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. చిరుతపులిలను మనకు అందించిన దేశప్రజలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. చాలా కాలం తర్వాత మా కోరిక తీర్చారు అని ప్రధాని అన్నారు.

Related posts

విజయనగరంలో రెడ్ క్రాస్ సొసైటీ వందేళ్ల పండుగ

Satyam NEWS

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు న్యూయార్క్, సింగపూర్

Satyam NEWS

కాగజ్ నగర్ కాలేజీలో కేసీఆర్ జన్మదిన హరితహారం

Satyam NEWS

Leave a Comment